బిగ్‌బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ లీక్..మోనాల్ పారితోషికం తెలిస్తే షాకే..లాస్య, నోయల్‌కు ఎంతంటే!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయంపై రకరకాల ఉహాగానాలు చోటుచేసుకొన్నాయి. అయితే తాజాగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ చెల్లించిన రెమ్యునరేషన్ల విషయాలు అనధికారికంగా బయటకు వచ్చాయి. అయితే జాబితా ప్రకారం ఒక్కొక్కరికి ఎంత చెల్లిస్తున్నారంటే...

రోజువారీ, వారాల లెక్కన పారితోషికాలు
సాధారణంగా బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్‌ను బట్టి వారికి ఉన్న రేంజ్‌ను బట్టి రెమ్యునరేషన్లను నిర్ణయిస్తారు. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీలకు రోజువారీ చొప్పను పారితోషికాన్ని చెల్లిస్తారు. అలాగే మరి కొందరికి వారం లెక్కన రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నట్టు సమాచారం.

స్వాతి దీక్షిత్, కుమార్ సాయికి పారితోషికం ఇలా
అయితే ఇప్పటి వరకు బిగ్‌బాస్ షోలో దాదాపు 19 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన స్వాతి దీక్షిత్, కుమార్ సాయికి వారానికి 2 లక్షల రూపాయల చొప్పున చెల్లించారు. అలాగే ఎలిమినేట్ అయిన సుజాత కూడా రూ.2 లక్షల పారితోషికాన్ని వారానికి లెక్కన అందించినట్టు సమాచారం.

వారానికి రూ.2.5 లక్షలు చొప్పును అందుకొంటున్న సెలబ్రిటీలు
ఇక ప్రస్తుత బిగ్‌బాస్ షోలో స్టార్ కంటెస్టెంట్‌గా మారిన అఖిల్ సార్థక్‌కు, ఎలిమినేట్ అయిన దివి వద్యాకు, అలాగే బిగ్‌బాస్ షోకు అత్యంత క్రేజ్ తెచ్చి పెట్టిన అవినాష్‌కు, సోహైల్ సయ్యద్ ర్యాన్, మెహబూబ్ దిల్ సే, అరియానా గ్లోరికి వారానికి రూ.2.5 చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిసింది.

వీక్లిలో రూ.3 లక్షలు అందుకొంటున్న కంటెస్టెంట్లు
ఇక వారానికి రూ.3 లక్షల చొప్పున చెల్లించే వారిలో చాలా మందే ఉన్నారు. ఇప్పటికే షో నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణికి, దేవి నాగవల్లికి, గంగవ్వకు, సూర్య కిరణ్‌కు వారానికి మూడు లక్షల చొప్పున చెల్లించినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం గ్లామర్ పంట పండిస్తున్న హారిక దేత్తడికి కూడా వారానికి రూ.3 లక్షల రూపాయలను చెల్లించే విధంగా ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది.

అభిజిత్, అమ్మా రాజశేఖర్‌కు సమానంగా
ఇంటిలో సీనియర్ కంటెస్టెంట్లకు భారీగా చెల్లిస్తున్నట్టు సమాచారం అందుబాటులో ఉంది. అమ్మా రాజశేఖర్, అభిజిత్‌కు వారానికి రూ.3 లక్షల చొప్పున చెల్లించే విధంగా వారితో అగ్రిమెంట్ జరిగినట్టు సమాచారం. వీరికి సినియారిటిని బట్టి రెమ్యునరేషన్‌ను చెల్లించినట్టు తెలుస్తున్నది.

టాప్ రేంజ్‌లో లాస్య మంజునాథ్
ఇక బిగ్‌బాస్ సీజన్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకొంటున్న టాప్ 3 సెలబ్రిటీలలో లాస్య మంజునాథ్, ఒకరు. లాస్యతోపాటు ఆరోగ్య కారణాల వల్ల ఎలిమినేట్ అయిన నోయల్ సీన్‌కు రూ.7 లక్షల రూపాయల చొప్పున వారానికి చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే పాపులర్ యాంకర్ కావడం, రెండేళ్ల బిడ్డను వదలి షోకు రావడంతో ఆమె భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం.

అత్యధికంగా మోనాల్ గజ్జర్‌కు పారితోషికం
ప్రస్తుత బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకొంటున్న వారిలో మోనాల్ గజ్జర్ ఒకరు. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించిన మోనాల్ టాప్ రెమ్యునరేషన్ అందుకొంటున్న సెలబ్రిటీగా మారారు. మోనాల్‌కు అత్యధికంగా వారానికి రూ.11 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టు సమాచారం. తాజా పారితోషికాల వివరాలు అనధికారమైనప్పటికీ.. దాదాపు ఇవే రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications