నన్ను బయటకు పంపించండి.. గంగవ్వకు కరోనా పరీక్షలు? టెన్షన్‌లో బిగ్‌బాస్ హౌస్!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5‌లో అద్బుతంగా రాణిస్తున్న గంగవ్వ అనూహ్యంగా అనారోగ్యం పాలుకావడం ప్రేక్షకులతోపాటు పార్టిసిపెంట్లకు, నిర్వాహకులు షాక్ తిన్నారు. చలాకీగా మాటలు రువ్వుతూ ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న గంగవ్వ అస్వస్థతకు గురవ్వడం ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లో ఆందోళనకరంగా మారింది. అయితే ఈ క్రమంలో మీడియాలో గంగవ్వ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bigg Boss Telugu 4 : గంగవ్వకు కరోనా టెస్టులు అంటూ మీడియాలో చక్కర్లు !

ఇంటికి పంపించండి అంటూ

ఇంటికి పంపించండి అంటూ

గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్ ఇంటిలోని వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. గతవారాంతంలో నాగార్జునతో నన్ను ఇంటికి పంపించండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. వీలైనంత త్వరగా నన్ను పంపిస్తే నాకు బాగా ఉంటుంది. నాకు ఇక్కడ వచ్చిన కష్టాలు లేవు. కానీ ఇంటి బెంగ ఎక్కువైంది అంటూ హోస్ట్ నాగార్జునతో మొరపెట్టుకొన్నారు. దాంతో అవ్వ నీవు ఇక్కడ ఉండాలి. ఇంట్లో సభ్యులకు పెద్ద దిక్కుగా మారాలి అంటూ నాగార్జున ధైర్యాన్ని ఇచ్చారు.

తీవ్ర అస్వస్థతకు గురైన గంగవ్వ

తీవ్ర అస్వస్థతకు గురైన గంగవ్వ

గురువారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో గంగవ్వ అస్వస్థతకు గురయ్యారు. గంగవ్వ పక్కనే లాస్య ఉండి జాగ్రత్తలు చూసుకొన్నారు. ఆ తర్వాత గంగవ్వ పరిస్థితిని గమనించిన బిగ్‌బాస్ ఇంటిలోని కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించారు. అక్కడతో ఊరటనిచ్చే మాటలు చెప్పారు. ఆ సమయంలో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నన్ను పంపించండి అంటూ గంగవ్వ బిగ్‌బాస్‌ను వేడుకొన్నారు. అయితే నీ ఆరోగ్యం గురించి బెంగపడకు. మేము జాగ్రత్తగా చూసుకొంటాం. డాక్టర్లు మీకు వైద్యం చేస్తారు. సమయానికి మందులు వేసుకో అంటూ చెప్పారు.

గంగవ్వ నీది గట్టి శరీరం

గంగవ్వ నీది గట్టి శరీరం

అయితే గంగవ్వ బిగ్‌బాస్ వాతావరణంలో ఉండలేకపోతున్నాను. ఇంతకంటే చాలా కష్టాలు అనుభవించాను. కానీ ఇప్పుటి పరిస్థితి నాకు సరిపడటం లేదు. మీరు చెప్పినట్టు నాది గట్టి శరీరమే. రాళ్లను కూడా పగల కొట్టాను అంటూ గంగవ్వ సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఆమెకు రిలీఫ్ కలిగించే మాటలు చెప్పి ఇంటిలోకి పంపించారు. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ గంగవ్వ ఇంటిలో చలాకీగా కనిపించడం విశేషం. ఇంటి సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గంగవ్వకు కరోనా టెస్టులు

గంగవ్వకు కరోనా టెస్టులు

ఇక బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు దాదాపు 20 రోజులపాటు గంగవ్వను క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తర్వాతే అన్ని పరీక్షలు చేయించి బిగ్‌బాస్ ఇంటిలోకి తీసుకొచ్చారు. తాజాగా అనారోగ్యం పాలు కావడంతో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇతర సెలబ్రిటీల ఆరోగ్యం దృష్టా, ముందస్తు జాగ్రత్తగా గంగవ్వకు కరోనా టెస్టులు జరిపించారన్నది తాజా సమాచారం. అయితే నిర్వాహకులు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వార్తలో నిజమెంత అనేది తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X