బిగ్‌బాస్ 4: కరాటే కల్యాణికి గంగవ్వ దిమ్మ తిరిగే పంచులు.. అభిజిత్‌తో ఫైర్‌బ్రాండ్‌కు గొడవ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా తొలివారంలో రెండో ఎపిసోడ్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోని ఫాలో ఫాలో సాంగ్‌తో ఆరంభమైంది. ఇంటి సభ్యులందరూ ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలాగే ఇంటిలో కట్టప్ప ఉన్నాడు.. ఆ కట్టప్ప ఎవరో తెలుసుకోవాలనే హెచ్చరిక చేస్తూ పోస్టర్లు వెలిశాయి. రెండో రోజు ఇంటిలో జరిగిన విషయాలు ఏమిటంటే..

ఎన్టీఆర్ ఫాలో ఫాలో పాటతో
బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యులు పాటించాల్సిన నిబంధనల గురించి వివరాలు చెప్పే టాస్క్‌ను కరాటే కల్యాణికి ఇచ్చారు. ఇంటి సభ్యులు తెలుగులోనే మాట్లాడాలి. ఇంటి సభ్యులు తప్పనిసరిగా మైక్ ధరించాలి అంటూ కొన్ని నిబంధనలు చెప్పారు. నోయల్ సీన్ కొన్ని జోకులు చేస్తూ ఇంటి సభ్యులను నవ్వించేందుకు ప్రయత్నించారు.

కల్యాణికి గంగవ్వ చురకలు..
అయితే కరాటే కల్యాణి టీచర్ అవతారం ఎత్తి మాట్లాడుతుంటే ఇంటి సభ్యులు ఆటపట్టించారు. గంగవ్వ తన మాటలతో కల్యాణికి చురకలు అంటించారు. గలగలా మాట్లాడుతూ ఇంటి సభ్యులను హుషారెత్తించారు. బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ వేసే కౌంటర్లు ఫుల్లుగా వినోదాన్ని పంచుతున్నాయి. గంగవ్వను అందరూ ఆప్యాయంగా చూసుకొంటూ కనిపించారు.

సీక్రెట్ రూమ్‌లో అరియానా గ్లోరి, సోహైల్
సీక్రెట్ రూమ్‌లో ఉన్న అరియానా, సోహైల్ ఇంటిలోని సభ్యులకు ఫోన్ చేసి ముందు రోజు ఫుడ్ ఎవరికి పంపించారు. ఈ రోజు ఎందుకు పంపించలేదు. మీ ఇంటికి పొరుగున ఉన్న వాళ్ల గురించి ఆలోచించరా? అంటూ అరియానా గ్లోరి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించారు. అలా వారి సంభాషణ అలా కొనసాగింది. అయితే సీక్రెట్ రూమ్‌లో ఉన్న ఇద్దరు ఇంటి సభ్యులను చిరాకు పెట్టాలి. కానీ ఇంటి సభ్యులు వారిద్దరి సంభాషణను ఎంజాయ్ చేస్తూ.. గ్లోరి, సోహైల్‌పై విసుగు చెందుతూ ఫోన్ పెట్టేశారు.

కట్టప్ప ఎవరు టాస్క్..
ఇంటిలో కట్టప్ప ఎవరు అనే విషయంపై చిన్న టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. ఇంటి సభ్యుల్లో ఎవరినైతే కట్టప్పగా భావిస్తారో వారి పేరును ఓ పేపర్‌పై రాసి అక్కడే ఉన్న బాక్స్‌లో వేయాలి. ఆ తర్వాత ఆ బాక్స్‌ను ఇద్దరు ముసుగు వీరులు వచ్చి తీసుకెళ్లడం జరిగింది. దాంతో కట్టప్ప ఎవరు అనే టాస్క్ ముగిసింది. అయితే కట్టప్ప ఎవరు పోటీలో అఖిల్ పేరును ఎక్కువ మంది సూచించారు.
Recommended Video

అభిజిత్‌తో గొడవపడిన కల్యాణి
ఇంటిలో కరాటే కల్యాణితో పలువురితో గొడవలు జరిగాయి. ఇంట్లో మోనాల్, నోయల్ సీన్, అభిజిత్, గంగవ్వ కూర్చొని మాట్లాడుతుండగా కరాటే కల్యాణి ఇబ్బందికి గురైంది. అభిజిత్ ఏదో అనడంతో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ గరం అయ్యింది. దాంతో అభిజిత్‌తోపాటు అందరూ విస్తుపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోపంతో కల్యాణి వెళ్లిపోయింది. ఆ తర్వాత అభిజిత్ వచ్చి కల్యాణితో మాట్లాడి.. తనకు ఎలాంటి కోపం లేదని విషయాన్ని చెప్పడంతో వారి మధ్య గొడవకు పుల్‌స్టాప్ పడింది.


Click it and Unblock the Notifications











