అరేయ్ ఏంట్రా ఇది.. బ్యాక్ టూ బ్యాక్ బొక్క నాకు.. టెన్షన్ తట్టుకోలేక హారిక షాకింగ్ కామెంట్

బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. ప్రస్తుతం నాలుగవ సీజన్ లో జరుగుతున్న పరిణామాలు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. మొదట స్టార్ట్ అయిన విధానానికి ఇప్పుడు కొనసాగుతున్న బిగ్ బాస్ కు సంబంధం లేదనే చెప్పాలి. బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు మామూలుగా లేవు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో గేమ్ చెంజర్ అవుతోంది దేత్తడి హారిక.

అఖిల్ విషయంలో కూడా అదే జరుగుతోంది

అఖిల్ విషయంలో కూడా అదే జరుగుతోంది

ఈ వారం ఎలిమినేషన్స్ పై రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్ బాస్. హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారు అనేది ఒక్క రోజులో తెలడం లేదు. గత వారం వరకు షోలో పరిణామాలను బట్టి ముందే ఊహించారు ఆడియెన్స్. అయితే లాస్య విషయంలో అంచనాలు తరుమరయ్యాయి. ఇక ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా అదే విధంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

హారిక తలపై ఇది పెద్ద భారమే..

హారిక తలపై ఇది పెద్ద భారమే..

అసలైతే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన అఖిల్ ఆ మధ్య సీక్రెట్ రూమ్ ద్వారా బ్రతికిపోయాడు. ఇక ఇప్పుడు అతనే డేంజర్ జోన్ లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్ గా మొదటిసారి ఎంపికైన హారిక తలపై పెద్ద భారాలు మొయిస్తున్నాడు బగ్ బాస్. కొన్ని తెలిసి చేస్తుంటే కొన్ని తెలియకుండానే క్రియేట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

హారిక.. గేమ్ చెంజర్

హారిక.. గేమ్ చెంజర్

సోమవారం అభిని కావాలని సేవ్ చేసిన హారిక మంగళవారం మాత్రం అనుకోకుండా అఖిల్ ని డేంజర్ జోన్ లోకి నెట్టేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా హారిక హౌజ్ లో ఒక గేమ్ చెంజర్ గా మారింది. అందని ద్రాక్ష అనుకున్న కెప్టెన్ పోస్ట్ ఎట్టకేలకు హారిక చేతికి వచ్చింది. కానీ ఆ ఆనందంలోనే ఆమెకు కొత్త టెన్షన్స్ మొదలయ్యాయి.

బిగ్ బాస్ లో రాజకీయాలు

బిగ్ బాస్ లో రాజకీయాలు

బిగ్ బాస్ లో పొలిటికల్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన బిగ్ బాస్ అవినాష్, అఖిల్ లను రాజకీయ నాయకుల మాదిరిగా మార్చేశాడు. మంగళవారం ఎపిసోడ్ లో జెండాలు ఎక్కువ కలెక్ట్ చేసే టాస్క్ ఇవ్వగా అందులో అఖిల్, అవినాష్ ఎక్కువ కలెక్ట్ చేశారు. అయితే వారిద్దరికీ మిగిలిన ఐదుగురు ఓటు వేసే అవకాశం కల్పించారు. అందుకోసం ఎన్నికల ప్రచారం మాదిరిగా ఓట్లు అడగాలని అవినాష్, అఖిల్ లకి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఆ ఓట్లు ఎవరికి వస్తాయో అర్ధమయ్యింది

ఆ ఓట్లు ఎవరికి వస్తాయో అర్ధమయ్యింది

ఇక అఖిల్, అవినాష్ వారి పార్టీ గుర్తులతో బిగ్ బాస్ హౌజ్ ని రాజకీయ రణరంగంగా మార్చారు. ఇక అరియానా గుర్రం గుర్తుకే మన ఓటు అంటూ అవినాష్ కు సపోర్ట్ చేసింది. మరోవైపు అదే తరహాలో సోహెల్ తన మిత్రుడు అఖిల్ కు సపోర్ట్ చేస్తూ కనిపించాడు. అప్పుడే నాలుగు ఓట్లు చాలా ఈజీగా ఎవరికి పడతాయో అర్ధమయ్యింది. అరియానా, అభి ఇద్దరు అవినాష్ కి ఫిక్స్ అవ్వగా.. సోహెల్, మోనాల్ ..అఖిల్ కు ఓటేస్తారని అర్ధమయ్యింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
బ్యాక్ టూ బ్యాక్ ఈ బొక్క ఏంటి..

బ్యాక్ టూ బ్యాక్ ఈ బొక్క ఏంటి..

ఇక హారిక ఒక చోట కూర్చోని ఆలోచిస్తూ ఉండగా అఖిల్ ఆమె వద్దకు వెళ్లి నిన్ను పెద్దగా ఎప్పుడు హెల్ప్ అడగలేదు. నాకు ఈ సమయంలో హెల్ప్ చెయ్ అని అడిగాడు. ఇక అవినాష్ కూడా కన్నీళ్ళతో అదే రేంజ్ లో అడుగగా.. ముందు రోజు కూడా ఇలాంటి టెన్షన్ ని చూసి అభిని సేవ్ చేసిన హారిక ఇప్పుడు మరో టెన్షన్ కూడా రావడంతో బ్యాక్ టూ బ్యాక్ ఈ బొక్క ఏంటి నాకు అంటూ.. అసహనం వ్యక్తం చేసింది. అయితే ఫైనల్ గా ఆమె అవినాష్ కే ఓటు వేసి అఖిల్ కు షాక్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X