twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    bigg boss telugu 4: బిగ్ బాస్ తెలుగు 4లోకి టీవీ 9 డేరింగ్ యాంకర్ దేవి నాగవల్లి

    |

    ఎన్నో రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోన్న బిగ్‌బాస్ షో ఎట్టకేలకు ప్రారంభమైది. ఇక ప్రతీ ఇంట్లో సందడి నెలకొంటుంది. కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, ఆపాయ్యతలు, బంధాలు, అనుబంధాలు, రాగద్వేషాలు, ఆట పాటలతో తెలుగు ప్రజల ఇంట్లో సందడి చేయబోతోన్నారు. హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. లైవ్ అప్డేట్స్ మీకోసం..

    బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ లలో టీవీ 9 న్యూస్ ఛానెల్ డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్ దేవి నాగవల్లి అడుగు పెట్టింది. గత రెండు సీజన్లలో కూడా ఇద్దరు టీవీ9 యాంకర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2కి టీవీ 9 యాంకర్ దీప్తి రాగా.. మూడో సీజన్‌కి ముఖాముఖి ఫేమ్ జాఫర్ ఎంట్రీ ఇచ్చారు.

    bigg boss telugu 4 Dethadi Harika Entered In Bigg Boss House

    అయితే వారి కంటే ఎక్కువ క్రేజ్ అందుకున్న దేవి షోలో ఏ విధంగా అడుగులు వేయబోతోంది అనేది హాట్ టాపిక్ గా మారింది. దేవి 2009లో నేషనల్ టెలివిజన్ అవార్డు (DELHI) గెలుచుకున్న మొదటి తెలుగు న్యూస్ ప్రెజెంటర్. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక "నంది" అవార్డును కూడా అందుకున్నారు. అనంతరం 2010లో కూడా మరో నంది అవార్డును కైవసం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి ప్రముఖ న్యూస్ యాంకర్ బిగ్ బాస్ లోకి అడుగుపెడుతుండడం వలన షోకి మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

    English summary
    Bigg Boss Telugu Season 4: Opening Ceremony Live Dethadi Harika Entered In Bigg Boss As 5th Contestant,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X