Bigg Boss Telugu 4: ఎనిమిదో కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
మోనాల్, సూర్య కిరణ్, లాస్య, సజాత, అభిజీత్, దిల్‌సే మెహబూబ్, దేవీ నాగవల్లి ఎంట్రీ ఇవ్వగా.. ఎనిమిదో కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక ప్రవేశించింది. చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్‌కు పెద్ద ఫ్యాన్ అని, తన కంటే తన అమ్మకే ఎక్కువ ఇంట్రెస్ట్ అని హారిక చెప్పుకొచ్చింది. నిజమో కాదో తెలుసుకోవాలనే కోరిక ఉండేదని, ఆఫర్ రాగానే ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపింది.

ఒక్కో యాసలో ఒక్కొక్కరికి పట్టు ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు భాషలో లెక్కలేనన్ని యాసలున్నాయి. అందులో తెలంగాణ యాస, భాషకు ప్రత్యేకస్థానం ఉంది. తెలంగాణ పిల్లగా సోషల్ మీడియాలో దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. యూట్యూబ్‌లో ఈమె వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. ఫ్రస్టేటెడ్ గర్ల్‌గా ఈమె చేసిన ఎన్నో పాత్రలు, గుక్కతిప్పుకోకుండా చెప్పే డైలాగ్‌లు ఎంతో ఫేమస్. యూట్యూట్ నుంచి వెండితెర వరకు సాగిన ఈమె ప్రయాణంలో కొత్త మలుపు వచ్చింది. బిగ్ బాస్ ద్వారా హారిక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది. ఈ నాల్గో సీజన్‌లో అలేఖ్య కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె సందడితో బిగ్ బాస్‌లో కొత్త జోష్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి చివరి వరకు నిలబడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











