For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒక్క అమ్మాయిని వదలవారా? మెహబూబ్‌పై అమ్మరాజశేఖర్ ఫైర్.. యమా హాట్‌గా దేత్తడి హారిక, దివి

  |

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో 9వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రధానంగా వినోదం, హాస్యం, ఎమోషన్స్ మేళవింపుతో కొనసాగింది. ఇంటిలో దేత్తడి హారిక, కరాటే కల్యాణి, సుజాత, కుమార్ సాయి, దేవి నాగవళ్లి తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అలాగే అమ్మ రాజశేఖర్‌ కామెడీతోపాటు ఇతరులు ఫన్నీ సంభాషణలు ఆకట్టుకొన్నాయి. 9వ రోజు ఎపిసోడ్స్‌లో హైలెట్స్ ఇలా ఉన్నాయి...

  రేసుగుర్రం బ్లాక్‌బస్టర్ పాటతో

  రేసుగుర్రం బ్లాక్‌బస్టర్ పాటతో

  అల్లు అర్జు నటించిన రేసుగుర్రం చిత్రంలోని బ్లాక్‌బస్టర్ పాటతో బిగ్‌బాస్ హౌస్‌లో 9వ రోజు ఎపిసోడ్‌ ప్రారంభమైంది. ఇంటి సభ్యులు ఉత్సాహంగా స్టెప్పులతో ఆడిపాడారు. సెలబ్రిటీలందరూ కలిసి సంబరంతో 9వ రోజును జోష్‌తో మొదలుపెట్టారు. ఆ తర్వాత కిచెన్‌లో సరదాగా పనుల్లో మునిగిపోయారు. అలా సెలబ్రిటీలు తమ రోజును సరికొత్తగా ఆరంభించారు.

  దేత్తడి హారిక హాట్ హాట్‌గా అదరగొట్టింది

  దేత్తడి హారిక హాట్ హాట్‌గా అదరగొట్టింది


  ఇక హాట్ హాట్‌గా తయారైన దేత్తడి హారిక తన ఫెర్ఫార్మెన్స్ ఇరుగదీసింది. గ్లామర్‌గా తయారై అందాల ఆరబోతతో సెలబ్రిటీలకు మతిపోగొట్టే పనిచేసింది. మసాలా పాటలకు డ్యాన్స్ చేసింది. మెహబూబ్‌తో కలిసి హాట్‌గా స్టెప్పులు వేసింది. అఖిల్‌తో కలిసి అదిరేటి డ్రస్సు మీరేస్తే పాటకు గ్లామర్‌ ప్రదర్శనతో ఆకట్టుకొన్నారు. దేత్తడి రేంజ్‌లో హరిక తన గ్లామర్ ప్రదర్శనతో అలరించింది. ఎపిసోడ్‌లో మరింత జోష్‌ను నింపింది.

  చీరకట్టులో మతిపొగొట్టే విధంగా దివి వద్యా

  చీరకట్టులో మతిపొగొట్టే విధంగా దివి వద్యా

  దివి వద్యా చీరకట్టులో అందంగా తయారై ఇంటి సభ్యులను ఆకట్టుకొన్నది. మెహబూబ్‌ను పిలిస్తే అమాంతంగా దివిని ఎత్తుకొని కౌగిలిలో బంధించాడు. దాంతో ఏందిరా ఒక్క అమ్మాయినైనా ఇదిలిపెట్టవారా.. దేత్తి హారిక, అరియానా గ్లోరి, ఇప్పుడు దివిని లేపుకెళ్తున్నావు. వీలైతే నీవు కల్యాణి ఎత్తుకోరా అప్పుడు చూద్దాం అంటూ అమ్మా రాజశేఖర్ సవాల్ విసిరితే.. మెహబూబ్ తన సత్తాను ప్రదర్శించి కల్యాణిని ఎత్తుకొన్నాడు. దాంతో ఆ ఘోరాన్ని చూడలేం అంటూ అక్కడి నుంచి రాజశేఖర్ పరుగులు పెట్టారు.

  సిక్స్‌ప్యాక్‌తో కండల వీరుడిగా మెహబూబ్

  సిక్స్‌ప్యాక్‌తో కండల వీరుడిగా మెహబూబ్


  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4లో మెహబూబ్ అదరొట్టాడు. సిక్స్‌ప్యాక్‌తో కండల ప్రదర్శన చేసి ఆకట్టుకొన్నారు. ఇప్పటి వరకు లో ప్రొఫైల్‌లో ఉన్న మెహబూబ్ ఈ సీజన్‌లో నేను పోటీలో ఉన్నాననే సంకేతాలిచ్చారు. మెహబూబ్ ఇప్పుడిప్పుడే షోలో మెల్లగా బయటపడుతున్నాడు. ఇక ముందు ఇంటిలో మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారే అవకాశం లేకపోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

  Bigg Boss Telugu 4: Episode 9 Highlights | 2nd Elimination Nominations
  అమెరికా అల్లుడు డ్రామాలో కల్యాణి

  అమెరికా అల్లుడు డ్రామాలో కల్యాణి


  ఇక ఇంటిలో అమెరికా అల్లుడు డ్రామా ఆకట్టుకొన్నది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మొదలైన ఈ ఎపిసోడ్‌లో గయ్యాలి అత్తగా కరాటే కల్యాణి, కొడుకుగా అభిజిత్, కోడలుగా సుజాత నటించారు. కల్యాణి కూతురుగా దివి వద్యా, అమెరికా అల్లుడిగా అఖిల్ నటించారు. గయ్యాలి అత్తకు కనువిప్పు కలిగించిన కథగా రూపొందిన డ్రామాలో నటీనటులు హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించారు.

  English summary
  Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Day 6 goes with happy note. In first weekend Abijeet, Sujatha and Gangavva saved from eliminations. Dettadi Harika, Divi Vadthya Glamour show highlights in Day 9.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X