Bigg Boss Telugu 4: ఆరో కంటెస్టెంట్‌గా ‘దిల్ సే’ మెహబూబ్
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
ఆరో కంటెస్టెంట్‌గా దిల్ సే మెహబూబ్ (యూట్యూబర్) ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో దుమ్ములేపాడు. లవర్ ఆల్ సో.. ఫైటర్ ఆల్ సో అనే పాటకు డ్యాన్స్ చేయడంతో.. లవ్ చేస్తావా? ఫైట్ చేస్తావా? అని అడిగితే.. నేను ప్రేమను మాత్రమే పంచుతాను అని, ఇప్పటి వరకు అదే చేశాను.. హౌస్ లోపల కూడా ప్రేమే పంచుతాను అని చెప్పుకొచ్చాడు. మాది గుంటూరు. నాకు సినిమా పిచ్చి కానీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను. ఇక నా వల్ల కాదని వన్ ఇయర్ బ్రేక్ తీసుకుని వచ్చాను. కానీ ఇక్కడ చాలా నెగెటివిటీ. ట్రోల్ చేశారు, బతకలేవు అన్నారు..కానీ కష్టపడ్డాను అని మెహబూబ్ తన ప్రయాణాన్నిచెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం ఎంత కష్టమో అంత సులభం కూడా. చేతిలో ఫోన్ ఉన్నా సరే ప్రపంచం మొత్తం మనల్ని చూసేలా చేయోచ్చు. ఒకప్పుడు డబ్ స్మాష్, మొన్నటి వరకు టిక్ టాక్ ఇలా ఎన్నో సాధనాలు ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేశాయి. అందులో ఒకడు మొహబూబ దిల్ సే.. యూట్యూబ్‌లో లక్షలకు లక్షలు వ్యూస్ సంపాదిస్తున్నాడు. ఇతని నాలుగు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో మనోడి ఫాలోయింగ్ కూడా వేరే లెవెల్. వెబ్ సిరీస్‌లు, చార్ట్ బస్టర్, హిట్ అయిన పాటలకు తనదైన శైలిలో కవర్ సాంగ్స్ చేయడం ఇతని స్టైల్. ఇక ఇతను బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంత వరకు నిలదొక్కుకుంటాడో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











