కొంచెం తగ్గించుకుంటే మంచిది.. సూర్య కిరణ్ ఫైర్.. మొదటిసారి నోరు విప్పిన దివి!
బిగ్‌బాస్ షో అంటేనే ఓ విచిత్రం. పులిని పిల్లిలా చేస్తుంది.. పిల్లిని పులిలా చేస్తుంది. నోట్లో నాలుక లేదేమో పాపం అని అనుకున్నవారి చేతనే.. వామ్మో ఏంటిలా మాట్లాడేసింది అనేట్టు చేస్తాడు. తాజాగా దివి విషయంలోనూ ఇదే జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఈ మూడు రోజుల్లో ఏనాడు ఓ ముక్క కూడా మాట్లాడని దివి చేత ఏకంగా అందరికీ క్లాస్ పీకించాడు బిగ్‌బాస్. ఇక దివి నోరు విప్పడంతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

షోలో అలా అలా..
బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ అప్పుడు నాగార్జునతో మాట్లాడిన మాటలే తప్పా ఇంకో చోట నోరు విప్పలేదు. ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలొనైనా మాట్లాడుతుందేమో అని ఆడియెన్స్ ఎదురుచూశారు. కానీ ఎన్ని గొడవలు జరిగినా, ఎంత మంది ఏడ్చినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

చిన్న చిన్న రియాక్షన్స్..
షోలో దివి ఎక్కువగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆమె ఇచ్చిన చిన్న చిన్న రియాక్షన్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఆమె కనబడుటలేదు అంటూ సోషల్ మీడియాలో వెరైటీ వెరైటీ మీమ్స్ వైరల్ అయ్యాయి. ఒక్క మాటైనా మాట్లాడు దివి అంటూ ఫ్యాన్స్ అల్లల్లాడిపోయారు. ఆ అందరి మొరను బిగ్‌బాస్ విన్నాడు. అందుకే ఆమెతో ఏకంగా ప్రోమో వచ్చే లెవెల్‌లో అందరి దుమ్ము దులిపించాడు.

ఆ రియాక్షన్స్ వైరల్..
షోలో దివి ఇచ్చిన కొన్ని రియాక్షన్స్ మాత్రం తెగ వైరల్ అయ్యాయి. కరాటే కళ్యాణి చేసే అతికి ఇచ్చిన రియాక్షన్, కరాటే కళ్యాణి అభిజీత్ మాట్లాడుకుంటూ ఉంటే అటు వెళ్లే దివి వెంటనే వెనుదిరిగి వెళ్లేప్పుడు రియాక్షన్ ఫుల్ క్లిక్కయ్యాయి. తాజాగా దివిపై రిలీజ్ చేసిన ప్రోమోలో రచ్చ చేసింది.

కొంచెం తగ్గించుకుంటే..
హౌస్‌మేట్స్‌పై తనకున్న అభిప్రాయాలను చెప్పుకొచ్చింది దివి. ప్రతీచిన్న విషయానికి ఏడుస్తున్నావ్.. సీరియస్ విషయానికి ఏడిచినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు అంటూ మోనాల్‌కు సలహా ఇచ్చింది. ఏదో మార్చుకోవాలి అంటూ అఖిల్‌కు కూడా సలహా ఇచ్చింది. లాస్య విషయంలో సెన్సిటివ్ అంటూ కామెంట్ చేసింది. నా మాటే వినాలి అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిదని సూర్య కిరణ్ మొహం మీదే చెప్పేసింది. నేను తగ్గించుకోను అంటూ సూర్య కిరణ్ ఫైర్ అయ్యాడు. మరి పూర్తి ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











