Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 4 Elimination: చోటా ప్యాక్.. బడా ధమాకా అవుట్.. టాప్ 5 నుంచి చోటు బయటకు!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియ ఇంటిలో మొదలైంది. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒక్కొక్కరి ఎలిమినేషన్ ప్రక్రియను హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. ఆ క్రమంలోనే టాప్ 5 కంటెస్టెంట్లలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఇంటి నుంచి బయటకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సీజన్లో ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలా సాగిందంటే..
గత సీజన్ల కంటే భిన్నంగా
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగింపు వేడుకలను అట్టహాసంగా హోస్ట్ నాగార్జున చేత నిర్వాహకులు ప్రారంభించారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఉండేలా ఎపిసోడ్‌ను డిజైన్ చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా యువ తారలు, సీనియర్ తారలతో వినోదభరితమైన కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిసింది.
దేత్తడి హారికకు తక్కువ ఓటింగ్
ఇక బిగ్‌బాస్‌ను మూడు నెలలకు పైగా ఫాలో అవుతున్న ప్రేక్షకులు ఊహించినట్టుగానే దేత్తడి హారికకు అత్యల్పంగా ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఓటింగ్ శాతం ప్రకారం దేత్తడి హారిక ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్‌గా నిలిచినట్టు తెలుస్తున్నది.
ఇంటి నుంచి చోటూ బయటకు..
బిగ్‌బాస్ ఇంటిలో చోటూగా నిక్‌నేమ్ సంపాదించుకొన్న దేత్తడి హారిక టాప్ 5లో కంటెస్టెంట్లో మొదటి సెలబ్రిటీగా ఇంటి భయటకు వెళ్లినట్టు సమాచారం. చోటా పాకెట్ బడా ధమాకా హారిక ఎలిమినేషన్‌తో చివరి అంకం మొదలైంది. ఇక శనివారం మరో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసి షూటింగును నిలిపివేసే అవకాశం ఉంది.
బిగ్‌బాస్ విజేత ఎవరంటే
బిగ్‌బాస్ ఇంటి నుంచి దేత్తడి హారిక బయటకు వెళ్లిన తర్వాత ఇంటిలో అఖిల్ సార్థక్, అరియానా గ్లోరి, సయ్యద్ సోహెల్ ర్యాన్, అభిజిత్ పోటీలో మిగిలారు. అయితే అభిజిత్ టైటిల్ గెలిచే వ్యక్తిగా ఇప్పటికే అనధికారికంగా వార్తలు వెలువడుతున్నాయి.
గ్రాండ్ ఫినాలే ప్రసారం ఎప్పుడంటే..
డిసెంబర్ 20వ తేదీన ముగిసే బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన ఎపిసోడ్ కోసం షూటింగు పూర్తి కావొస్తున్నది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ప్రసారం కానున్నది. ఆ ఎపిసోడ్‌లోనే బిగ్‌బాస్ విజేత ఎవరనేది అధికారికంగా వెల్లడిస్తారు.