దివి ఎలిమినేషన్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు.. మోనాల్ కోసమే ఇంత చీప్‌గా, దారుణంగానా?
బిగ్‌బాస్ తెలుగు షో నుంచి దివి వద్యా ఎలిమినేట్ కావడంపై ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫేక్ ఎమోషన్స్ కాకుండా నిజాయితీగా ఆడుతున్న బలమైన కంటెస్టెంట్‌ను బయటకు పంపించారనే విమర్శలను నెటిజన్లు గుప్పిస్తున్నారు. దివి వద్యా ఎలిమినేషన్ బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన ట్వీట్లు ఇవే...
Recommended Video

దివిని ఎలిమినేట్ చేయాల్సింది కాదు
బిగ్‌బాస్ నుంచి దివిని ఎలిమినేట్ చేయాల్సింది కాదు. ఇలాంటి ఎలిమినేషన్లు జరిగితే ప్రజలకు షో మీద విశ్వాసం పోతుంది. మంచి కంటెస్టెంట్లను బయటకు పంపిస్తే ఇక షో విలువ ఏముంటుంది. ఇప్పటికైనా నిర్వాహకులు మేల్కోంటే మంచిది. బిగ్‌బాస్ ఫ్యాన్‌గా ఇది నా సలహా అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇక బిగ్ బాస్ చూడలేను
దివి వద్యా బిగ్‌బాస్ నుంచి బయటకు పోవడం నాకు చాలా బాధ కలిగించింది. దివి లేకుండా నేను బిగ్‌బాస్ చూడలేను. దివిని మళ్లి వెనుకకు రప్పించాలి అంటూ మరో నెటిజన్ తన బాధనకు ట్విట్టర్‌లో వెళ్లగక్కాడు.

బిగ్‌బాస్ ఓ ఫేక్ షో
దివి ఎలిమినేషన్ మరో నెటిజన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్ ట్విట్టర్ అకౌంట్ అక్కర్లేదు. హాట్ స్టార్ యాప్‌ను తీసేయాలి. ఇక ఓటింగ్ చేయవద్దు. బిగ్‌బాస్ తెలుగు 4నే చూడొద్దు. బిగ్‌బాస్ అనేది నా దృష్టిలో ఓ సింపుల్ షో. ఓ ఫేక్ షో. మోనాల్ లాంటి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయాలి అంటూ నెటిజన్ భగ్గుమన్నాడు.

దారుణంగా బిగ్‌బాస్ ఎలిమినేషన్
బిగ్‌బాస్ తెలుగు 4లో ఎలిమినేషన్ దారుణంగా ఉంది. దివిని బయటకు పంపించండం సరికాదు. మరోసారి బిగ్‌బాస్‌లో అన్ ఫెయిర్‌గా ఎలిమినేషన్ జరిగింది. ఓటింగ్ పరంగా మోనాల్ చివరిస్థానంలో ఉంది. బిగ్‌బాస్ షోను కేవలం టీఆర్పీ కోసమే నడుపుతున్నారు అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు.

దివికి బదులు మోనాల్‌ను
దివికి బదులు మోనాల్‌ను ఎలిమినేట్ చేయాల్సింది. దివి ఎలిమినేట్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మోనాల్‌ను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. టీఆర్పీ కోసం ఇంత చీప్‌గా ఎలిమినేషన్ చేస్తారా అంటూ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

దివి మంచి కంటెస్టెంట్
దివి వద్యా ఎలిమినేట్ కావడం దారుణం. మోనాల్ గజ్జర్, నోయల్ సీన్, అమ్మ రాజశేఖర్ కంటే మంచి కంటెస్టెంట్. అనుకోనివి, ఊహించనవి జరిగేదే బిగ్‌బాస్ షో అంటారు. కానీ బిగ్‌బాస్ నుంచి ఏది ఆశించకూడదనేది నా ఇన్నర్ ఫీలింగ్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

దివి టాలెంటెడ్.. ఎలిమినేషన్ ఆశ్చర్యంగా
దివిని ఇంత త్వరగా బయటకు పంపిస్తారా? చాలా దురదృష్టకరం. దివి టాలెంటెడ్, మంచి స్పీకర్, మోనాల్ ఎలా కొనసాగుతున్నదో నాకు అర్ధం కావడం లేదు. బయట చాలా అసంతృప్తి ఉన్నా ఆమె ఎలిమినేట్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదో గుడుపుఠాణి జరుగుతున్నది అంటూ మరో నెటిజన్ అనుమానం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











