భర్తకు కావాల్సిన క్వాలిటీస్ అవినాష్‌లో లేవు.. నాకు ఆ ఇద్దరే ప్రాణం.. అరియానా గ్లోరి హాట్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 4 ముగిసినా ఆ రియాలిటి షోలో టాప్ కంటెస్టెంట్టుగా నిలిచినా అరియానా గ్లోరి, ముక్కు అవినాష్ రిలేషన్ గురించిన చర్చ మీడియాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. వారిద్దరి బంధంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అరియానా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

అత్యంత దగ్గరైన వ్యక్తి అవినాష్

అత్యంత దగ్గరైన వ్యక్తి అవినాష్

బిగ్‌బాస్‌ 4లో నాకు అత్యంత దగ్గరైన వ్యక్తి అవినాష్‌. ఆయన నాకు క్లోజ్‌ఫ్రెండ్. బిగ్‌బాస్ ఇంట్లో నాకు ఎలాంటి సమస్య వచ్చిన వెన్నంటి ఉన్నాడు. నా జ్వరం వస్తే చాలా బాగా చూసుకొన్నాడు. నాకు ఆకలి అయితే గోరుముద్దలు తినిపించాడు. అలాంటి వ్యక్తి నాకు దూరమైతే బాధపడటం సహజం. అవినాష్ ఎలిమినేట్ అయ్యాడనే విషయాన్ని ఇంట్లో నేను తట్టుకోలేకపోయాను అని అరియానా అన్నారు.

నన్ను ఎప్పుడూ నామినేట్ చేయలేదు

నన్ను ఎప్పుడూ నామినేట్ చేయలేదు

బిగ్‌బాస్ ఇంటిలో నన్ను ఎప్పుడూ నామినేట్ చేయలేదు. నా గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. నాతో కొందరు గేమ్స్ ఆడినట్టుగా అవినాష్ ఆడలేదు. అలాంటి వ్యక్తితో కొన్నిసార్లు గొడవపడినా వెంటనే నేను మాట్లాడాను. నా ప్రవర్తన అలానే ఉంటుంది అని అరియానా పేర్కొన్నారు.

అవినాష్‌తో ఉంది ఫ్రెండ్‌షిప్ మాత్రమే

అవినాష్‌తో ఉంది ఫ్రెండ్‌షిప్ మాత్రమే

అవినాష్‌ నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య లవ్ అఫైర్ లేదు. ప్రేమ వేరు, స్నేహం వేరు. అందరూ అనుకొంటున్నట్టుగా మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప మరో బాండింగ్ లేదు. మా బంధం భవిష్యత్‌లో ప్రేమగా మారుతుందో అనే విషయాన్ని కాలానికే వదిలి వేద్దాం. ఇప్పుడు మా బంధంపై ఊహాగానాలు వద్దు అని అరియానా అన్నారు.

జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు లేవు

జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు లేవు

అవినాష్‌ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. కానీ నా ఊహించుకొనే జీవిత భాగస్వామి, భర్తలో ఉండాల్సిన గుణాలు అవినాష్‌లో కనిపించలేదు. కాబోయే భర్త గురించి నాకు చాలా అభిప్రాయలు ఉన్నాయ. ఫ్రెండ్‌కు, భర్తకు లింకు పెట్టకూడదు అని అరియానా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Recommended Video

PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
నా జీవితంలో ఆ ఇద్దరికే...

నా జీవితంలో ఆ ఇద్దరికే...

నా జీవితంలో మరో ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారు. ఒకరు వినీత్, అమర్ నా అత్యంత ఇష్టమైన వారు. మా మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. ప్రతీ విషయంలో నాకు అండగా ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అదుకొన్నారు. కాబట్టి వినీత్, అమర్ విషయంలో అఫైర్లు అంటగట్టవద్దు. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వాడు వినీత్ అని అరియానా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X