అమ్మా రాజశేఖర్, నోయల్ మధ్య చిచ్చుపెట్టిన స్వాతి దీక్షిత్.. నీ జీవితాంతం కుమిలిపోతావు అంటూ..
బిగ్‌బాస్ హౌస్‌లో గురు, శిష్యులుగా కనిపించే అమ్మా రాజశేఖర్‌కు, నోయల్ సీన్‌కు స్వాతి దీక్షిత్ చిచ్చు పెట్టింది. గతవారం నామినేషన్‌లో స్వాతి దీక్షిత్‌ను అమ్మా రాజశేఖర్ నామినేట్ చేయడంపై నోయల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా ఆమెను నామినేట్ చేయడం వల్ల వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన స్వాతి ఇంటి బయటకు వెళ్లిపోయింది. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని నోయల్ చెబుతూ..

అమ్మా రాజశేఖర్‌ను నామినేట్ చేస్తూ
అమ్మా రాజశేఖర్‌ను నామినేట్ చేయడానికి గల కారణాలను వివరిస్తూ.. ఎవరినైనా నామినేట్ చేయడానికి బలమైన కారణం ఉండాలి. మీరు నామినేట్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఇక్కడ నిలబడే హక్కు లేకుండా పోయింది. మనం సేఫ్ గేమ్ ఆడుతూ ఇంకొకరిని నామినేట్ చేయడం బాధ అనిపించింది. అందుకే నామినేట్ చేస్తున్నాను అని నోయల్ చెప్పారు.

స్వాతి నామినేట్ చేయడం తప్పు
స్వాతి దీక్షిత్ ఈ నామినేషన్ ప్రక్రియలో ఉండి ఉంటే.. ఆమెకు ఎదురైన ఇబ్బందులను చెప్పేది. ఆ అవకాశం ఇవ్వకుండా ఓ మొక్కను ఎదగకుండా పోయింది. అందుకే నాకు బాధ అనిపించి మిమల్ని నామినేట్ చేస్తున్నాను. మనం సేఫ్ గేమ్ ఆడవద్దని చెప్పడానికే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. మరోలా అనుకోవద్దు అని నోయల్ అన్నాడు. ముఖానికి ఫోమ్ రాసి నామినేట్ చేసినందుకు క్షమించాలంటూ కాళ్లు మొక్కాడు.

సినిమా డైలాగ్స్ చెప్పొద్దు
అయితే నామినేషన్ ప్రక్రియ తర్వాత కూడా అమ్మా రాజశేఖర్, నోయల్ మధ్య చిన్న ఘర్షణ జరిగినట్టు మంగళవారం గేమ్ ప్రోమో స్పష్టం చేసింది. స్వాతి దీక్షిత్ గురించి ఏదో చెప్పబోగా.. నీవు చిన్న పిల్లలకు చెప్పినట్టు సినిమా డైలాగ్స్ చెప్పకు అంటూ నోయల్‌పై అమ్మా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. మళ్లీ మళ్లీ నన్ను బాధపెట్టకు అంటూ కసరుకొన్నారు.
Recommended Video

నీవు జీవితాంతం ఫీల్ అవ్వాలి
ఇక అంతటితో ఆగకుండా నోయల్‌పై అమ్మా రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో నన్ను ఉంచకుండా బయటకు పంపించాలని ప్లాన్ చేశావు. నీ కోసం ఈ వారం నేను బయటకు పోవాలి. నీ జీవితాంతం నీవు ఫీల్ అవ్వాలి అంటూ అమ్మా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. అమ్మా రాజశేఖర్, నోయల్ మధ్య జరిగిన వాగ్వాదం తాజా ప్రోమోలో స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











