ఎవడికి ధమ్‌కి ఇస్తున్నవ్.. సోహెల్ మొహం మీద కొట్టినట్లు అఖిల్ వార్నింగ్, బట్టలు లాగేసిన హారిక

బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ రోజురోజుకు ప్రచారలు బాగానే చేసుకుంటోంది గాని మళ్ళీ ఎప్పటిలానే సీరియల్స్ కంటే దారుణమైన రేంజ్ లో రేటింగ్స్ అందుకుంటోంది. కనీసం టాప్ 5లో కూడా నిలవడం లేదు. నాగార్జున కూడా రేటింగ్స్ విషయంలో ఏ మాత్రం సంతృప్తిగా లేడని తెలుస్తోంది. ఇక అందుకే వివాదాల డోస్ ఎక్కువవ్వాలని అనుకున్నారో ఏమో తెలియదు గాని బిగ్ బాస్ మాత్రం ఈ వారం నామినేషన్ కోసం గట్టి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

కొత్త తరహా నామినేషన్స్

కొత్త తరహా నామినేషన్స్

షోకి సంబంధించిన ప్రోమోలను వరుసగా విడుదల చేస్తున్న స్టార్ మా బజ్ బాగానే క్రియేట్ చేస్తోంది. హౌజ్ లో ఆఖరి నామినేషన్ అంటూ బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక గొడవలు క్రియేట్ చేసే టాస్క్ లో భాగంగా ఒక గేమ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఫాస్ట్ గా వెళ్లి కిరీటాన్ని అందుకున్న సోహెల్ రాజుగా కొత్త అవతారం ఎత్తాడు. హౌజ్ లో ఇక అతను ఇష్టం ఉన్నట్లు పరిపాలించవచ్చని ఆదేశాలు రావడంతో సోహెల్ సంతోషంగా నవ్వేశాడు.

 ప్రతి ఒక్కరికి మహారాజా టాస్క్..

ప్రతి ఒక్కరికి మహారాజా టాస్క్..

ఇక అతని మొదటి టార్గెట్ ఎవరో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అరియానాకు ఒక విదంగా సోహెల్ నరకం చూపించినట్లు మొదట ప్రోమోలో చూపించగానే సెకండ్ ప్రోమోలో కిరీటం హారిక తలపైకి వచ్చింది. బహుశా ఈ మహారాజా టాస్క్ లో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలా ఉంది. ఇక దాని నుంచి బిగ్ బాస్ ఆఖరి నామినేషన్స్ ప్రక్రియను కొనసాగించవచ్చనే డౌట్ వస్తోంది.

హారిక హెచ్చరించినా పట్టించుకోలేదు

హారిక హెచ్చరించినా పట్టించుకోలేదు


ఇక కిరీటం ధరించిన హారిక.. అభిజిత్, సోహెల్ లను దగ్గరికి రమ్మని చెప్పింది. కానీ వాళ్ళు ఎంత పిలిచినా కూడా రాలేదు. ఆమె రాజవ్వడం ఏమిటని నవ్వుకున్నారు. అఖిల్ మాత్రం ఆమె పక్కనే ఉన్నాడు. ఇక పిలిచిన వెంటనే రాకపోతే మీ బట్టలు స్విమ్మింగ్ ఫూల్ లో పడేస్తాను అంటూ హారిక వార్నింగ్ కూడా ఇచ్చింది.

 నా బట్టాలైతే పడేయ్యాలి చుక్కలు చూపిస్తాను

నా బట్టాలైతే పడేయ్యాలి చుక్కలు చూపిస్తాను

హారిక హెచ్చరిక జారీ చేసినప్పటికీ సోహెల్ పట్టించుకోలేదు. పైగా నా బట్టాలైతే పడేయ్యాలి చుక్కలు చూపిస్తాను అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక చెప్పినట్లే అఖిల్ చేత బట్టలు తెప్పించిన హారిక స్విమ్మింగ్ పూల్ లో పడేసింది. దాంతో ఒక్కసారిగా హౌజ్ లో వాతవరం చేంజ్ అయినట్లు అర్ధమయ్యింది. సోహెల్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా అర్ధమవుతోంది.

ఎవడికి ధమ్‌కి ఇస్తున్నవ్

ఎవడికి ధమ్‌కి ఇస్తున్నవ్

ఇక సోహెల్ మాటలకు అఖిల్ కూడా సీరియస్ అయ్యాడు. ఎవడికి ధమ్‌కి ఇస్తున్నవ్ అంటూ సోహెల్ మొహం మీద కొట్టినట్లు వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం సోహెల్ కుర్చీని నేలకేసి కొట్టి తన కోపాన్ని మరోసారి చూపించాడు. సోహెల్, అఖిల్ మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. కానీ ఈ సారి వీరి మధ్య గొడవ ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X