బిగ్‌బిస్ తెలుగు 4: తొమ్మిదో కంటెస్టెంట్‌గా యాక్టర్ సయ్యద్ సోహైల్
లాక్‌డౌన్ పరిస్థితులను ఎదిరిస్తూ భారీ హంగామా మధ్య ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి తొమ్మిది కంటెస్టెంట్‌గా సయ్యద్ సోహైల్ ఎంట్రీ ఇచ్చారు. కొత్త బంగారం లోకంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సయ్యద్ బ్రేక్ కోసం చాలా సంవత్సరాలు ఎదురుచూశారు. చివరకు బిగ్‌బాస్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు సిద్ధమయ్యారు.
టాలీవుడ్‌లో పలు సినిమాలతోపాటు కొన్ని టెలివిజన్ సీరియల్స్ చేశారు. అయితే తనకు ఓ గుర్తింపు రావాలంటే బిగ్‌బాస్ మాత్రమే అని బలంగా నమ్మాను. గత మూడేళ్లుగా బిగ్‌బాస్‌లోకి రావాలని టెలివిజన్ సిరియల్స్ కూడా చేయలేదు. చివరకు ఇలా బిగ్‌బాస్‌లోకి రావాలన్న కోరిక ఇలా తీరింది అంటూ సయ్యద్ సోహైల్ తెలిపారు. అయితే సోహైల్‌ను ఇంటిలోకి పంపకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపడం ఈ షోలో ప్రత్యేకతగా మారింది.

బిగ్‌బాస్ తెలుగు 4లోకి వచ్చే లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొంటాను. నా ప్రతిభను చాటుకొని నా కంటూ ప్రత్యేకమైన బ్రేక్ తెచ్చుకొంటానని సయ్యద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాగార్జున లాంటి వ్యక్తి ముందు నిలబడటమే పెద్ద బ్రేక్ అనే విధంగా సయ్యద్ మాట్లాడారు.


Click it and Unblock the Notifications











