బిగ్‌బాస్‌లో కట్టప్పనే ఇంటి కెప్టెన్.. ఎలిమినేట్ వేటు తప్పించుకొన్న ఆ ముగ్గురు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మిశ్రమ స్పందనతో తొలివారం ముగిసేందుకు సిద్ధమైంది. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియతోపాటు ఇంటి కెప్టెన్ ఎంపిక జరిగింది. ఇంటి సభ్యులతో హోస్ట్ నాగార్జున సరదాగా గడుపుతూ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. అలాగే కట్టప్ప ఎవరో చెబుతూ చివరల్లో ఓ ఝలక్ ఇచ్చారు. ఇంతకు నాగ్ ఇచ్చిన ఝలక్ ఏందంటే...

ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్న అభిజిత్
బిగ్‌బాస్ తెలుగు 4 లో తొలివారం నామినేట్ అయిన వారిలో సూర్య కిరణ్, మెహబూబ్, అభిజిత్, సుజాత, గంగవ్వ, అఖిల్ సార్థక్, దివి వద్యా నామినేట్ అయ్యారు. అయితే సీజన్ 4లో ఎలిమినేషన్ నుంచి బయటపడిన వారిలో తొలి అభ్యర్తిగా అభిజిత్ ఘనతను సాధించాడు. అభిజిత్ సేఫ్ కావడం అందర్నీ సంతోషంలో ముంచెత్తింది.

గంగవ్వ, సుజాత కూడా సేఫ్
ఇక తొలివారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో సేఫ్ అయిన వారిలో జోర్దార్ సుజాత ఒకరు. సుజాతకు మంచి ఓట్లు రావడంతో ఎలిమినేషన్ వేటు నుంచి బయటపడ్డారు. అలాగే మూడో వ్యక్తిగా గంగవ్వ సేఫ్ అయ్యారు. అయితే గంగవ్వ ఎలిమినేషన్ ప్రక్రియను తప్పించుకోవడం అంతగా ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో మంచి ఫాలోయింగ్ ఎవరికైనా ఉందంటే గంగవ్వకే అని అందరికీ తెలిసిందే.

కట్టప్పగా ఎంపికైన యాంకర్ లాస్య
ఇక వారమంతా ఊరించిన ప్రశ్న.. బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరు? ఇంటి సభ్యులు ఓటింగ్ ప్రకారం యాంకర్ లాస్యను కట్టప్పగా డిసైడ్ చేశారు. ముక్కుసూటిగా కాకుండా నర్మగర్భమైన మనస్తత్వంతో ఉన్న లాస్యను కట్టప్పగా అభివర్ణించారు. అనంతరం ఈ ఇంటిలో కట్టప్ప ఎవరు లేరని ఝలక్ ఇచ్చారు. దాంతో అవును ఇంటిలో అలాంటి మనస్తత్వం ఎవరికీ లేదు అని అందరూ చెప్పుకొన్నారు.
Recommended Video

కట్టప్పతోపాటు కెప్టెన్‌గా లాస్యనే ఎంపిక..
ఇక ఇంటి కెప్టెన్ ఎవరనే విషయం గురించి ఎవరికి అంతగా ఆలోచన రాలేదు. కానీ కట్టప్పగా ఎంపికైన లాస్యనే ఇంటి కెప్టెన్‌గా సెలెక్ట్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు 4లో తొలి కెప్టెన్‌గా లాస్య ఎంపిక కావడం విశేషం. వారం రోజులపాటు కెప్టెన్‌గా ఉంటారు. కెప్టెన్‌కు ఉండే అన్ని సౌకర్యాలను ఆమె అనుభవిస్తారు. ముఖ్యంగా వచ్చే వారం ఆమె నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకొంటారు.


Click it and Unblock the Notifications











