మంచిగున్న టెన్షన్ పడకుర్రి.. గంగవ్వ ఆరోగ్యంపై బిగ్‌బాస్ టీమ్ అప్‌డేట్

బిగ్‌బాస్ షోలో గంగవ్వ పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. నిన్నటి ఎపిసోడ్‌లో గంగవ్వ కంటతడి పెట్టుకుంది. కన్‌ఫెషన్ రూంలోకి పిలుచుకుని మరీ ధైర్యం చెప్పాడు బిగ్‌బాస్. కానీ గంగవ్వ వల్ల అవ్వడం లేదు. బాంచన్ నేను పోతా.. నాకు వాతావరణ పడతలేదు అని మొత్తుకుంది. ఇక గంగవ్వ ధీనస్థితి చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక గంగవ్వకు ఏదో జరిగిందని, సీరియస్ అంటూ ఉదయం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇంటికి పంపించండి అంటూ

ఇంటికి పంపించండి అంటూ

ఇక్కడి వాతావరణం పడతలేదు.. ఉండలేకపోతోన్నాను... అందరూ బాగానే చూసుకుంటున్నారు.. మీరు బిడ్డలాగే చూసుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నాను.. నా వల్ల అయితలేదు అంటూ గంగవ్వ మొరపెట్టుకుంది. ఇక గంగవ్వ మాటలకు బిగ్‌బాస్ సమాధానం చెబుతూ ఓదార్పాడు. మొదట్లో అందరికీ అలానే ఉంటుందని సర్దిచెప్పాడు.

గట్టిదాన్నే గానీ..

గట్టిదాన్నే గానీ..


గంగవ్వ ధీనస్థితిని చూసిన బిగ్‌బాస్ ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశాడు. నువ్ చాలా ధైర్యవంతురాలివి గంగవ్వ అని చెప్పుకొచ్చాడు. తాను ధైర్యవంతురాలినే బయట బండలు కూడా పగలగొట్టాను..ఇప్పుడు కూడా పగలగొడతాను.. కానీ ఇక్కడి వాతావరణం మాత్రం పడతలేదు.. నన్ను బయటకు పంపించండి అంటూ వేడుకుంది. గంగవ్వను డాక్టర్ రూంలోకి తీసుకెళ్లి చికిత్స అందించేలా బిగ్‌బాస్ ఏర్పాట్లు చేశారు.

గంగవ్వను చూసి..

గంగవ్వను చూసి..


అలా టీవీలో గంగవ్వ ఏడ్వడం చూసి అలీరెజా, శివజ్యోతి, హిమజ కూడా ఎమోషనల్ అయ్యారు. గంగవ్వ పరిస్థితిని చూసి చలించి పోయామని పోస్ట్‌లు చేశారు. దీనికి తోడు గంగవ్వకు కరోనా పరీక్షలు, ఆరోగ్యం క్షీణించింది అంటూ వార్తలు వైరల్ కాసాగాయి. అయితే వీటిపై గంగవ్వ టీం స్పందించింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : గంగవ్వకు కరోనా టెస్టులు అంటూ మీడియాలో చక్కర్లు !
మంచిగున్న..

మంచిగున్న..


గంగవ్వపై వస్తోన్న రూమర్స్, ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై గంగవ్వ టీం స్పందించింది. మంచిగున్న టెన్షన్ పడకుర్రి అంటూ గంగవ్వ చెప్పినట్టుగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా వివేకానంద కొటేషన్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసి అందరిలోనూ ధైర్యాన్ని నింపారు. బలమే జీవితం.. బలహీనతే మరణం అనే సూక్తితో పరోక్షంగా గంగవ్వ ఎంత ధృడంగా చెప్పకనే చెప్పేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X