నోయల్ సీన్‌కు జైలు శిక్ష.. ఇంట్లోకి వైల్డ్ కార్డుతో సెలబ్రిటీ ఎంట్రీ? ఆ హీరోయిన్ ఎవరంటే
బిగ్‌బాస్ ఇంటిలో 18 రోజు ఆట టాస్క్‌తో కొనసాగింది. రోబో టీమ్, మానవుల టీమ్ మధ్య అదే గొడవలు కొనసాగాయి. టాస్క్ పూర్తయినట్టు తెలిపి విజేతను ప్రకటించారు. ఆ తర్వాత కెప్టెన్సీకి అభ్యర్థులను నిర్ణయించారు. అలాగే ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో హీరోయిన్‌ను పంపడం ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. 18 రోజుల జరిగిన విషయాలు వివరంగా..
Recommended Video

రోబో టీమ్ విజయం
బిగ్‌బాస్ తెలుగు 4 షోలో కొనసాగుతున్న ఉక్కు హృదయం టాస్క్ గురువారం కూడా కొనసాగింది. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాటం చేశాయి. అయితే చివరికు అభిజిత్, గంగవ్వ ఉన్న రోబో టీమ్ విజయం సాధించింది. మానవుల టీమ్ ప్రయత్నాన్ని కూడా బిగ్‌బాస్ అభినందించారు. ఈ గేమ్‌లో అభిజిత్, గంగవ్వ, హారిక తదితరులు ఆకట్టుకొన్నారు. అభిజిత్ వ్యూహాలతో రోబో టీమ్ అత్యధిక పాయింట్లు చేజిక్కించుకొన్నది.

కెప్టెన్సీ పోరులో ఆ నలుగురు
ఉక్కు హృదయం టాస్క్ ఆధారంగా కెప్టెన్‌ను నిర్ణయించే గేమ్ మొదలైంది. ఉక్కు హృదయం టాస్క్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన అభిజిత్, హారిక, గంగవ్వ, అవినాష్‌ను కెప్టెన్సీ కోసం జరిగే పోటీకి అభ్యర్థులుగా ప్రకటించారు. మానవుల టీమ్ చెత్తగా ఆడిన నోయల్ సీన్‌ను జైలుకు పంపించాడు. బిగ్‌బాస్ తెలుగు 4లో తొలిసారి జైలుకు వెళ్లిన వారిలో నోయల్ సీన్ మొదటివాడు కావడం గమనార్హం.

జైలుకు వెళ్లిన నోయల్ సీన్
జైలుకు వెళ్లిన నోయల్‌కు బిగ్‌బాస్ కఠిన ఆంక్షలు విధించాడు. జైలులో ఉన్నంత సేపు ఇంటి నుంచి నోయల్‌కు ఆహారం అందించవద్దు. ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని హెచ్చరించారు. రాగి జావ మాత్రమే ఇవ్వాలని సూచించారు. రాగులను ఇస్తే ఆయనే ఫుడ్‌ను తయారు చేసుకోవాలని చెప్పాడు. ఇంకా ఏదైనా ఒక పండును ఇవ్వవచ్చని చెప్పారు. దాంతో జైల్లో ఉన్న నోయల్ సీన్‌ను సభ్యులు ఊరడించారు. అన్నా నీన్ను కాపాడుకొంటాం. నీ కోసం దేనికైనా సిద్దం అంటూ డైలాగ్స్ వదిలారు.

ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ
టాస్క్ పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులు ఆనందంగా పాటల పాడుకొంటూ ఇంట్లో సరదాగా గడుపుతుంటే ఇంట్లోకి మరో సెలబ్రిటీ అడుగుపెట్టారు. స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టడంతో ఇంటి సభ్యులు కంగారుతోపాటు ఉత్సాహంతో గెంతులేశారు. స్వాతి దీక్షిత్ ముఖానికి మాస్క్ పెట్టుకొని ఇంట్లోకి వచ్చింది. ఆమెను పూర్తిగా ప్రేక్షకులకు పరిచయం చేయకుండా క్యూరియాసిటీని మెయింటెన్ చేశారు.


Click it and Unblock the Notifications











