For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్దస్త్ అవినాష్‌కు భారీగా బిగ్‌బాస్ రెమ్యునరేషన్.. లాస్య, నోయల్ కంటే రెండితలు ఎక్కువేనట

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో‌లో జబర్దస్త్ అవినాష్‌ అలియాస్ ముక్కు అవినాష్ ఎంట్రీ లేట్ అయినప్పటికీ లేటేస్ట్‌గా అదరగొట్టేస్తున్నాడు. వాస్తవానికి అవినాష్ మొదటి రోజునే ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ జబర్తస్త్‌తో ఒప్పందం కారణంగా ఓ వారం లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే జబర్దస్త్‌‌తో ఉన్న ఒప్పందం కారణంగా భారీగా మూల్యం చెల్లించుకొన్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అయితే భారీగా మూల్యం చెల్లించుకొన్నప్పటికీ.. తనకు బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారనే వార్త మరింత క్రేజ్‌గా మారింది. ఇంతకు బిగ్‌బాస్‌లో అవినాష్ రెమ్యునరేషన్ ఎంతంటే..

    జబర్దస్త్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారని

    జబర్దస్త్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారని

    బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో పాల్గొనేందుకు జబర్దస్త్‌తో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, అందుకు నిర్వాహకులు తీవ్రంగా స్పందించడంతో అందుకు వారికి పరిహారాన్ని చెల్లించారని ఓ వార్త మీడియాలో వైరల్ అయింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి జబర్దస్త్‌కు 10 లక్షల రూపాయలు చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవినాష్ మాత్రం అధికారికంగా వెల్లడించిన దాఖలాలు లేవు.

    10 లక్షల పరిహారం‌పై జబర్దస్త్ నిర్వాహకుల ఖండన

    10 లక్షల పరిహారం‌పై జబర్దస్త్ నిర్వాహకుల ఖండన

    అవినాష్ అధికారికంగా వెల్లడించకుండానే 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించారనే వార్త ప్రధాన మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నది. అయితే అటు మల్లెమాల గానీ, అవినాష్ వర్గీయులు గానీ స్పందించలేదు. అయితే జబర్దస్త్ నిర్వాహకులతో అలాంటి ఉల్లంఘన సమస్య ఏమీ లేదని మరో వర్గం వెల్లడిస్తున్నది. అవినాష్ బిగ్‌బాస్‌లో చేరినందుకు గాను నిర్వాహకులు భారీగా ఆఫర్ చేసినట్టు సమాచారం.

    లాస్య, నోయల్‌కు భారీగా పారితోషికం

    లాస్య, నోయల్‌కు భారీగా పారితోషికం

    సోషల్ మీడియా, మీడియాలో వెలుగు చూసిన అంశాల ప్రకారం.. యాంకర్ లాస్య, నటుడు, గాయకుడు నోయల్ సీన్ రోజుకు లక్ష రూపాయల పారితోషికం ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎక్కడ వీరి రెమ్యునరేషన్‌ ధృవీకరించలేదు. అయినా వారి రేంజ్‌కు ఆ మొత్తం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు వెల్లడించాయి.

    లాస్క, నోయల్ కంటే రెండింతలు ఎక్కువే

    లాస్క, నోయల్ కంటే రెండింతలు ఎక్కువే

    ఇక బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్నందుకు గాను లాస్య, నోయల్ సీన్ కంటే రెండింతలు ఎక్కువగా ఇస్తున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే వారితో పోల్చుకొంటే ముక్కు అవినాష్‌కు రోజుకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు ఓ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అవినాష్ ప్రస్తుతం బిగ్‌బాస్‌లో టాప్ రెమ్యునరేషన్ తీసుకొనే వ్యక్తిగా రికార్డు సాధించినట్టే.

    Bigg Boss Telugu 4 : జోకర్ గా Jabardasth Avinash వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!!
    బిగ్‌బాస్ ఇంటిలో అవినాష్ తడాఖా

    బిగ్‌బాస్ ఇంటిలో అవినాష్ తడాఖా

    ఇక బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే అవినాష్ తన తడాఖా చూపిస్తున్నారు. తనదైన స్టయిల్‌లో ఇంటి సభ్యులను నవ్విస్తూ ఆకట్టుకొంటున్నారు. కొందరిపై తనదైన శైలిలో పంచులు వేస్తున్నారు. కొందరిని అనుకరిస్తూ ఇంటి నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. తనను అనుకరించడంపై మోనాల్ ఇటీవల అవినాష్‌కు క్లాస్ పీకారు. దాంతో కాస్త సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నారు.

    English summary
    Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Now show entered into Third week after successful completion of 2 weeks. Now, Jabardasth Avinash is highest paid celebrity than Lasya and Noel Sean has gone viral in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X