గందరగోళంగా బిగ్ బాస్ 4 లిస్ట్.. ఒకరు అవుట్.. మరొకరు ఇన్.. అంతా కన్ఫ్యూజన్!!

బిగ్‌బాస్ షో ప్రారంభం కాకముందే గందరగోళం నెలకొంది. ఇక షో ప్రారంభం అయితే ఇంకెంత హడావిడి ఉంటుందో అర్థం చేసుకోండి. లోపల కంటెస్టెంట్ల మధ్య గొడవలు, బయట వారి ఫాలోవర్స్ మధ్య మాటల యుద్దాలతో వ్యవహారం అంతా వేడెక్కుతుంది. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు యూనిట్.. నాల్గో సీజన్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మూడు గెటప్పులతో..

మూడు గెటప్పులతో..

బిగ్ బాస్ కాన్సెప్ట్‌ను తెలియజేసేలా విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. నాగ్ మూడు గెటప్పులో కనిపించి ఆకట్టుకున్నాడు. మన విషయాల కంటే పక్కింట్లో జరిగే విషయాలపైనే ఎక్కువగా మక్కువ ఉంటుందని చెబుతూ అంతకు మించిన ఎంటర్టైన్మెంట్‌ను ఇచ్చేందుకు నాల్గో సీజన్ రాబోతోందని తెలిపాడు.

కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్..

కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్..

నాల్గో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాల్గో సీజన్ ప్రకటన రాకముందు నుంచీ పార్టిసిపెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ లిస్ట్‌లోంచి కొన్ని పేర్లు మాయమవుతూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా తరుణ్, శ్రద్దాదాస్, ప్రగతి, పూనమ్ కౌర్ వంటి వారు ఉన్నారు. వీరంతా బిగ్ బాస్ వార్తలను ఖండించారు.

 రోజుకో పేరు తెరపైకి..

రోజుకో పేరు తెరపైకి..

మంగ్లీ, నందు, జబర్దస్త్ ముక్కు అవినాష్, యాంకర్ ప్రగతి, ఆరియానా, యూట్యూబర్ మెహబూబ్, సీరియల్ హీరో అఖిల్, సింగర్ నోయెల్, కొరియోగ్రఫర్ రఘు-ప్రణవి దంపతులు , కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాత, గంగవ్వ, ఇలా పాల్గొనబోతోన్నారని కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో రోజుకో పేరు కొత్తగా తెరపైకి వస్తోంది.

ఖండించిన జానీ మాస్టర్..

ఖండించిన జానీ మాస్టర్..

బిగ్ బాస్ 4 లిస్ట్‌లో గత వారం ఎక్కువగా వినిపించిన పేరు జానీ మాస్టర్. మెగా ఫ్యాన్స్ మద్దతు విపరీతంగా ఉండే జానీ మాస్టర్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్‌లో ఉంటుందని విశ్లేషణలు కూడా రాసేశారు కొంతమంది. అయితే తాను బిగ్ బాస్‌లోకి వెళ్లడం లేదని, అవన్నీ కేవలం రూమర్సేనని క్లారిటీ ఇచ్చాడు జానీ మాస్టర్.

తెరపైకి దేవీ నాగవల్లి..

తెరపైకి దేవీ నాగవల్లి..

తాజాగా టీవీ 9యాంకర్ దేవీ నాగవల్లి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఓ లెక్కన చూస్తే ఇది నిజమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండో సీజన్‌లో దీప్తి నల్లమోతు, మూడో సీజన్‌లో జాఫర్ అంటూ టీవీ యాంకర్లను దింపారు. అందుకే ఈ సారి దేవీ నాగవల్లిని బిగ్‌బాస్‌లోకి తీసుకొస్తున్నారని టాక్ మొదలైంది. మరి ఈమె నిజంగా ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X