twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 4: మూడో కంటెస్టెంట్‌గా లాస్య మంజునాథ్

    |

    బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

    మూడో కంటెస్టెంట్‌గా యాంకర్, హోస్ట్ లాస్య ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా మ్యూజిక్‌లో సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన లాస్య.. బిగ్‌బాస్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. చీమ-ఏనుగు జోకులకు లాస్య ఎంతో ఫేమస్. ఇక రవి-లాస్య జంట బుల్లితెరపై ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

     bigg boss telugu 4 Lasya Entered In Bigg Boss House As 3rd Contestant

    కెరీర్‌లో ఎన్ని కష్టాలు పడిందో వివరించింది. తన భర్తనే రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని, మొదటి రిజిష్టర్ మ్యారేజ్ అని, ఇంట్లో అందరూ ఒప్పుకున్నాక మళ్లీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఈ పదహారేళ్ల క్వారంటైన్‌లో బాబును వీడియో కాల్‌లో చూశాను వాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. నాకు అది చాలు. తల్లి ఏం చేసినా అది కొడుకు కోసమే కదా అని లాస్య చెప్పింది. ఇక నాగ్ స్టేజ్ మీదే లాస్యకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ బొమ్మలోనే తన కొడుకు జున్ను (దక్ష్)ను చూసుకుంటానని తెలిపింది. ఇక లోపలకి వెళ్లిన లాస్య.. మోనాల్, సూర్య కిరణ్‌తో పరిచయం పెంచుకుంది. ఇక బెడ్స్‌ను కూడా సెలెక్ట్ చేసుకుంది.

    English summary
    Bigg Boss Telugu Season 4: Opening Ceremony Live Lasya Entered In Bigg Boss House As 3rd Contestant,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X