Bigg Boss Telugu 4.. బిగ్‌బాస్ సెలెబ్రేషన్స్ షురూ.. మాస్క్ ముఖానికే ఎంటర్టైన్మెంట్‌కు కాదంటోన్న నాగ్
ఎన్నో రోజులుగా బుల్లితెర ప్రేక్షకులు, బిగ్‌బాస్ అభిమానులు ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. వంద రోజులకు పైగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆట, భిన్న మనస్తత్వాలు గల పదహారు మంది కంటెస్టెంట్లు, ఎక్కడెక్కడి వారో ఒక్క చోటకు రావడం, వారి మధ్య ప్రేమలు, గొడవలు, స్నేహాలు, కోపాలు, తాపాలు ఇలా ఎన్నో ఫీలింగ్స్, మరెన్నో ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్ షో నాల్గో సీజన్‌కు రెడీ అయింది.

మూడు సీజన్స్ సక్సెస్..
తెలుగులో బిగ్‌బాస్ షో అనేది వర్కౌట్ అవుతుందా? ఎవరైనా ఆదరిస్తారా? అనే కామెంట్స్ మొదట వచ్చాయి. ఇక మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో బిగ్‌బాస్ షోపై అందరికీ అంచనాలు పెరిగాయి. ఇక నాని రెండో సీజన్‌ను, కింగ్ నాగార్జున మూడో సీజన్‌ను విజయవంతంగా నడిపించారు.

కరోనా వల్ల ఆలస్యం..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఈపాటికే ఎప్పుడో మొదలుకావాల్సింది. కరోనా ఉధృతంగా ఉండటంతో వాయిదా పడుతూ పడుతూ సెప్టెంబర్‌కు వచ్చి పడింది. ఈ నాల్గో సీజన్‌ను కూడా నాగ్ తన భుజాల మీదే వేసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వర్కౌట్ అయ్యాయి. బిగ్ బాస్ కాన్సెప్ట్‌ను తెలియజేసేలా గాసిప్స్, హాట్ నెస్ అంటూ ప్రతీ ఒక్క అంశం ఉండోబోతోందని చెప్పకనే చెప్పారు.

కంటెస్టెంట్ల లిస్ట్..
నాల్గో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నోయెల్, దేత్తడి హారిక, దివి, లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, ముక్కు అవినాష్, దిల్ సే మెహబూబా, రఘు మాస్టర్, ఆరియానా, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్ వంటి వారు నాల్గో సీజన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

స్పెషల్ సర్ ప్రైజ్..
బిగ్‌బాస్ 4లో స్పెషల్ సర్ ప్రైజ్ ఉండబోతోందని రాహుల్ సిప్లిగంజ్ చెప్పడంతో అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. తాను ఇచ్చే సర్ ప్రైజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని రాహుల్ చెప్పడంతో అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాల్గో సీజన్ ప్రారంభ వేడుకల్లో రాహుల్ స్పెషల్ పర్ఫామెన్స్ ఇవ్వబోతోన్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సింది.
Recommended Video

మాస్క్ ముఖానికే ఎంటర్టైన్మెంట్‌కు కాదు..
తాజాగా బిగ్‌బాస్ టీం ఓ ప్రోమోను విడుదల చేశారు. రేపటి వేడుకలు ఎలా ఉండబోతోన్నాయో ఓ శాంపిల్ వదిలారు. కింగ్ నాగార్జున ఎంట్రీ నిజంగానే కింగ్‌లా ఉంది. ఇక ఈ వేడుకల్లో హీరోయిన్లు కూడా చిందులు వేయబోతోన్నట్టు కనిపిస్తోంది. మాస్క్ ముఖానికి అవసరం ఎంటర్టైన్మెంట్‌కు కాదు.. అంటూ నాగ్ చెప్పిన డైలాగ్‌ను పట్టి చూస్తే ఈ నాల్గో సీజన్ మరింత రచ్చ చేయబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











