Bigg Boss Telugu 4 Leak: ఫైనల్లోకి యాంగ్రీ యంగ్ మ్యాన్.. 48 గంటల టాస్క్‌లో విజేత ఎవరంటే!

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో రోడ్ టూ ఫినాలే టాస్క్ సుదీర్గంగా సాగింది. ఇంటి సభ్యుల మద్దతుతో, చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్‌తో కాస్త బోర్‌గానే ఈ టాస్క్ ముగిసింది. ఈ సీజన్‌లో ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టించిన సీన్ ఇదే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక టాస్క్ విజేతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

 పట్టుదలగా ఆడిన అఖిల్, సోహెల్

పట్టుదలగా ఆడిన అఖిల్, సోహెల్

రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా ఉయ్యాలపై కూర్చునే టాస్క్‌ను అఖిల్, సోహెల్ ఫ్రెండ్లీగా, పట్టుదలగా ఆడారు. టాస్క్‌ను చాలా డల్‌గా, ఎలాంటి ఆసక్తికరమైన అంశాలను జొప్పించకుండా టాస్క్‌ను కొనసాగించి ప్రేక్షకులకు విసుగుపుట్టించారు. దాంతో గురువారం ఎపిసోడ్ చాలా నిస్తేజంగా సాగింది.

అరియానా, అవినాష్ కామెడీతో

అరియానా, అవినాష్ కామెడీతో

ఇంటి సభ్యులు కాస్త స్పందించి భావోద్వేగం, వినోదకరమైన అంశాలను కలిపి గురువారం ఎపిసోడ్‌ను కాస్త ముందుకు తీసుకెళ్లారు. అభిజిత్, హారిక మధ్య మోనాల్ గురించి చర్చ, అలాగే అరియానా, అవినాష్ మధ్య చిలిపి గొడవ షోను ఆసక్తికరంగా మార్చింది. దాంతో ప్రేక్షకులకు హమ్మయ్య అనే ఫీలింగ్ కలిగింది.

48 గంటలపాటు టాస్క్

48 గంటలపాటు టాస్క్

రోడ్ టూ ఫినాలే టాస్క్‌ను గెలుచుకోవడానికి అఖిల్, సోహెల్ బెట్టు చేస్తూ అనేక రకాల కష్టాలను భరించి టాస్క్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ టాస్క్‌ దాదాపు 48 గంటలపాటు సాగిందనే తాజా సమాచారం. బిగ్‌బాస్ ఇంటిలో ఈ సీజన్‌కు సంబంధించి సాగిన సుదీర్ఘమైన టాస్క్ ఇదే కావచ్చు. ఈ టాస్క్‌లో బిగ్‌బాస్ ఇంటి సభ్యుల సహనాన్ని పరీక్షించడం గమనార్హం.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
ఫైనల్లోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ

ఫైనల్లోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ

తాజా సమాచారం ప్రకారం.. రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో అఖిల్ సార్థక్ విజయం సాధించినట్టు తెలిసింది. సోహెల్ టాస్క్‌ను కొనసాగించ లేక ఉయ్యాలపై నుంచి దిగిపోవడంతో అఖిల్ విజయం సాధించినట్టు సమాచారం అందింది. సోహెల్ దిగిపోయిన మరుక్షణమే అఖిల్ కూడా ఉయ్యాలపై నుంచి కిందికి దిగడం కూడా ప్రోమోలో కనిపించింది.

అభిజిత్‌ను కౌగిలించుకొన్న అఖిల్, సోహెల్

అభిజిత్‌ను కౌగిలించుకొన్న అఖిల్, సోహెల్

ఇక ఉయ్యాలపై నుంచి దిగిన అఖిల్ సార్థక్, సోహెల్ తమ టాస్క్‌కు సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్‌ను కౌగిలించుకోవడం కనిపించింది. అఖిల్, సోహెల్ ఇద్దరు కంటతడి పెట్టుకొని భావోద్వేగానికి కూడా గురయ్యారు. అలా టాస్క్ ముగిసినట్టు అభిజిత్ ప్రకటించడంతో అఖిల్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు బిగ్‌బాస్ ప్రకటించినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X