bigg boss telugu 4: పదిహేనో కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్

బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

పదిహేనో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమా వల్లే నాకు అఖిల్ అనే పేరు వచ్చింది. ఆ టైంలో నేను పుట్టాను. ఆ సమయంలో ఆ పేరు చాలా పాపులర్ అని నాకు పెట్టారు. ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడం చాలా సంతోషంగా ఉంది అని తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు అఖిల్.

bigg boss telugu 4 Live Updates Akhil Sarthak Entered In Bigg Boss House As 15th Contestant

ఇక షోలో ఏ పొజిషినల్‌లో ఉంటావని అనుకుంటున్నావ్? అంటూ నాగ్ ప్రశ్నించాడు. వెంటనే అఖిల్..టాప్ 2లో ఉంటాను అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.. నాకు నటించే అవసరం లేదు నాలా నేను ఉంటే ఈ షోలో ముందుకు వెళ్తాను అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఇక ఫిట్‌గా ఉన్న అఖిల్‌ను చూసి పుష్-అప్స్ ఎన్ని చేయగలవు అని అడిగితే స్టేజ్ మీదే 50 చేసి నాగ్‌ను ఆశ్చర్యపరిచాడు. తనకు ఇచ్చిన బాక్స్‌ను తీసుకుని ఇంటి లోపలికి వెళ్లిన అఖిల్.. అందర్నీ పలకరించాడు. మరి ఇతడి ప్రయాణం ఎన్ని రోజుల వరకు ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X