For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 4: ఆట మొదలైంది.. తొలిరోజే కంటతడి పెట్టించిన కరాటే కళ్యాణి, లాస్య, గంగవ్వ

  |

  బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

  Bigg Boss Telugu 4 : 16 Contestants Listed | Oneindia Telugu
  16వ కంటెస్టెంట్‌గా మై విలేజ్ లైప్ గంగవ్వ

  16వ కంటెస్టెంట్‌గా మై విలేజ్ లైప్ గంగవ్వ

  తెలుగు టెలివిజన్‌ రంగంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు. ఈ షో నాలుగు సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సారి ఇంటి సభ్యుల ఎంపిక సెన్సేషనల్‌గా సాగింది. తొలిసారి బిగ్‌బాస్ షోలో 60 ఏళ్లకుపైబడిన గంగవ్వ అలియాస్ మిల్కూరి గంగవ్వ కనిపించడం విశేషంగా మారింది. గంగవ్వ 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాగార్జునతో మాట్లాడుతూ స్ఫూర్తిని నింపారు.ఇక గంగవ్వ విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన అతి సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన మహిళ. నాట్లు, తోటల పెంపకం లాంటి వ్యవసాయ పనుల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న గంగవ్వ అనూహ్యంగా యూట్యూబ్‌లో షో ద్వారా అందరికీ పరిచయమైంది.

  పదిహేనో కంటెస్టెంట్‌గా అఖిల్...

  పదిహేనో కంటెస్టెంట్‌గా అఖిల్...

  పదిహేనో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమా వల్లే నాకు అఖిల్ అనే పేరు వచ్చింది. ఆ టైంలో నేను పుట్టాను. ఆ సమయంలో ఆ పేరు చాలా పాపులర్ అని నాకు పెట్టారు. ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడం చాలా సంతోషంగా ఉంది అని తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు అఖిల్. ఇక ఫిట్‌గా ఉన్న అఖిల్‌ను చూసి పుష్-అప్స్ ఎన్ని చేయగలవు అని అడిగితే స్టేజ్ మీదే 50 చేసి నాగ్‌ను ఆశ్చర్యపరిచాడు.

  14వ కంటెస్టెంట్‌గా మహర్షి ఫేం దివి వద్యా

  14వ కంటెస్టెంట్‌గా మహర్షి ఫేం దివి వద్యా

  అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లోకి మోడల్, హీరోయిన్‌ దివి వద్యా ప్రవేశించారు. దివి వద్యా 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ఎంబీఏ పూర్తి చేసిన ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. యాక్టింగ్ అంటే ఆమెకు పిచ్చి అనే విషయం తన ఇన్స్‌టాగ్రామ్‌లో చూస్తే తెలుస్తుంది.

  పదమూడో కంటెస్టెంట్‌గా నోయల్

  పదమూడో కంటెస్టెంట్‌గా నోయల్

  పదమూడో కంటెస్టెంట్‌గా సింగర్, ర్యాపర్, నటుడు నోయల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటి నుంచో వద్దామని ఎదురుచూశాను. ఇంట్లో వాళ్లకు కూడా నేను ఎలా ఉంటానో తెలియదు. వారికి ఇప్పుడు తెలుస్తుంది. లవ్ బర్డ్స్ సినిమాలో సాంగ్ విన్నప్పుడు ర్యాప్ నేర్చుకోవాలనే కోరిక పుట్టింది అని నోయల్ తన గురించి చెప్పుకొచ్చాడు. అనంతరం నాగ్, బిగ్‌బాస్‌పై కూడా అద్భుతమైన ర్యాప్ పాడి అందర్నీ ఆకట్టుకున్నాడు.

  పన్నెండో కంటెస్టెంట్‌గా కరాటే కళ్యాణి

  పన్నెండో కంటెస్టెంట్‌గా కరాటే కళ్యాణి


  పన్నెండో కంటెస్టెంట్‌గా కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చింది. జీవితంలో చదువు అబ్బలేదు గానీ సంప్రదాయ కళలపై మక్కువ ఏర్పడింది. హరికథలు చెప్పడంలో ఎన్నో అవార్డులు,రివార్డులు అందకుంది. బాబీ అంటూ చాలా ఫేమస్ అయ్యాను కానీ సినిమాల్లో చేసే క్యారెక్టర్ నేను కాదు. కరాటే కళ్యాణి అనే క్యారెక్టర్ పేరు కాదు.. నాకు తైక్వాండో ద్వారా వచ్చింది. జీవితంలో ఎందరో నన్ను వాడుకున్నారు. కానీ నాకు ఎవ్వరూ ఉపయోగపడలేదు అంటూ తన జీవితం గురించి చెప్పి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేసింది.

  11వ కంటెస్టెంట్‌గా రణం దర్శకుడు అమ్మా రాజశేఖర్

  11వ కంటెస్టెంట్‌గా రణం దర్శకుడు అమ్మా రాజశేఖర్

  ఎన్నో రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోన్న బిగ్‌బాస్ షో ఎట్టకేలకు ప్రారంభమైది. ఇక ప్రతీ ఇంట్లో సందడి నెలకొంటుంది. కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, ఆపాయ్యతలు, బంధాలు, అనుబంధాలు, రాగద్వేషాలు, ఆట పాటలతో తెలుగు ప్రజల ఇంట్లో సందడి చేయబోతోన్నారు. హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జున.. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ అమ్మా రాజశేఖర్‌ను 11వ కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. డైరెక్టర్‌గా వచ్చి నెంబర్ వన్‌గా నిలువాలని ఉన్నాను. కొద్ది రోజులుగా నాకు హిట్లు లేవు. కొంత గ్యాప్ వచ్చింది. బిగ్‌బాస్ ద్వారా మళ్లీ నెంబర్‌వన్ నిలువాలని కోరుకొంటున్నాను. అందుకే బిగ్‌బాస్‌లోకి వచ్చాను. ఇంతకు ముందు బిగ్‌బాస్‌లో నా శిష్యుడు బాబా భాస్కర్ వచ్చారు. ఇప్పుడు నేను రావడం చాలా హ్యాపీగా ఉంది అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు.

  సీక్రెట్ రూంలో ఆరియానా, సోహెల్.

  సీక్రెట్ రూంలో ఆరియానా, సోహెల్.

  తొమ్మిదో కంటెస్టెంట్‌గా వెండితెరపై హీరోగా, బుల్లితెరపై సీరియల్‌ హీరోగా ఆకట్టుకున్న సోహెల్, పదో కంటెస్టెంట్‌గా హాట్ యాంకర్ ఆరియాగా గ్లోరీ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిద్దరి ఎంట్రీతోనే ఓ ఆట ఆరంభించేశాడు బిగ్ బాస్. వీరిద్దరిని ఓ సీక్రెట్ రూం (నైబర్ రూం)లోకి పంపించాడు. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తుందని నాగ్ తెలిపాడు. ఆ రూంను చూసి ఇద్దరూ ఎగ్జైట్ అయ్యారు. అందులో వారికి సపరేట్ టీవీ, సపరేట్ బెడ్రూమ్స్, ఫోన్ కూడా ఉన్నాయి.

  బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా గ్లోరి.

  బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా గ్లోరి.


  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రెండోసారి హోస్ట్‌గా నాగార్జున వేదికపై అదరగొట్టేశారు. బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లే కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపే ముందు సెలబ్రిటీలను వేదికపైకి పిలిచి వారిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ యంగ్ అండ్ టాలెంటెడ్ వీడియో జాకీ అరియానా గ్లోరి నవ్వులు చిందిస్తూ తెరపైకి వచ్చారు. ఆమె పదో కంటెస్టెంట్‌గా ఇంటిలోకి ప్రవేశించారు. తాను బోల్డ్, దేనికి భయపడను అంటూ అరియానా గ్లోరి తెలిపారు.

   తొమ్మిదో కంటెస్టెంట్‌గా యాక్టర్ సయ్యద్ సోహైల్

  తొమ్మిదో కంటెస్టెంట్‌గా యాక్టర్ సయ్యద్ సోహైల్

  లాక్‌డౌన్ పరిస్థితులను ఎదిరిస్తూ భారీ హంగామా మధ్య ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లోకి తొమ్మిది కంటెస్టెంట్‌గా సయ్యద్ సోహైల్ ఎంట్రీ ఇచ్చారు. కొత్త బంగారం లోకంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సయ్యద్ బ్రేక్ కోసం చాలా సంవత్సరాలు ఎదురుచూశారు. చివరకు బిగ్‌బాస్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్‌లో పలు సినిమాలతోపాటు కొన్ని టెలివిజన్ సీరియల్స్ చేశారు. అయితే తనకు ఓ గుర్తింపు రావాలంటే బిగ్‌బాస్ మాత్రమే అని బలంగా నమ్మాను. గత మూడేళ్లుగా బిగ్‌బాస్‌లోకి రావాలని టెలివిజన్ సిరియల్స్ కూడా చేయలేదు. చివరకు ఇలా బిగ్‌బాస్‌లోకి రావాలన్న కోరిక ఇలా తీరింది అంటూ సయ్యద్ సోహైల్ తెలిపారు.

  ఎనిమిదో కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక

  ఎనిమిదో కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక

  ఎనిమిదో కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక ప్రవేశించింది. చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్‌కు పెద్ద ఫ్యాన్ అని, తన కంటే తన అమ్మకే ఎక్కువ ఇంట్రెస్ట్ అని హారిక చెప్పుకొచ్చింది. నిజమో కాదో తెలుసుకోవాలనే కోరిక ఉండేదని, ఆఫర్ రాగానే ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపింది. ఈమె సందడితో బిగ్ బాస్‌లో కొత్త జోష్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి చివరి వరకు నిలబడుతుందో లేదో చూడాలి.

  ఏడో కంటెస్టెంట్‌గా దేవీ నాగవల్లి

  ఏడో కంటెస్టెంట్‌గా దేవీ నాగవల్లి


  బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ లలో టీవీ 9 న్యూస్ ఛానెల్ డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్ దేవి నాగవల్లి అడుగు పెట్టింది. గత రెండు సీజన్లలో కూడా ఇద్దరు టీవీ9 యాంకర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2కి టీవీ 9 యాంకర్ దీప్తి రాగా.. మూడో సీజన్‌కి ముఖాముఖి ఫేమ్ జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ చరిత్రలో లేడీ బిగ్‌బాస్ లేరు. ఈ సారి నేను బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకొన్న మహిళగా రికార్డు సృష్టించాలన్నదే నా కోరిక అంటూ దేవీ నాగవళ్లి అన్నారు.

  ఆరో కంటెస్టెంట్‌గా మెహబూబ్

  ఆరో కంటెస్టెంట్‌గా మెహబూబ్


  ఆరో కంటెస్టెంట్‌గా దిల్ సే మెహబూబ్ (యూట్యూబర్) ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో దుమ్ములేపాడు. లవర్ ఆల్ సో.. ఫైటర్ ఆల్ సో అనే పాటకు డ్యాన్స్ చేయడంతో.. లవ్ చేస్తావా? ఫైట్ చేస్తావా? అని అడిగితే.. నేను ప్రేమను మాత్రమే పంచుతాను అని, ఇప్పటి వరకు అదే చేశాను.. హౌస్‌ లోపల కూడా ప్రేమే పంచుతాను అని చెప్పుకొచ్చాడు. మాది గుంటూరు. నాకు సినిమా పిచ్చి కానీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను. ఇక నా వల్ల కాదని వన్ ఇయర్ బ్రేక్ తీసుకుని వచ్చాను. కానీ ఇక్కడ చాలా నెగెటివిటీ. ట్రోల్ చేశారు, బతకలేవు అన్నారు..కానీ కష్టపడ్డాను అని మెహబూబ్ తన ప్రయాణాన్నిచెప్పుకొచ్చాడు.

  ఐదో కంటెస్టెంట్‌గా టెలివిజన్ హోస్ట్ సుజాత..

  ఐదో కంటెస్టెంట్‌గా టెలివిజన్ హోస్ట్ సుజాత..


  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4‌లో ఐదో కంటెస్టెంట్‌గా టెలివిజన్ హోస్ట్ సుజాత హౌస్‌లోకి ప్రవేశించారు. తన గురించి చెప్పే వీడియోలో తన బాల్యంలోని కష్టాలను చెప్పారు. ఓ సమయంలో తిండి తినడానికి కూడా కష్టపడ్డాం అని అన్నారు. నాగార్జునను బిట్టూ అంటూ ముద్దుగా పిలుస్తూ ఇంటి వేదికపై అల్లరి చేశారు. నాగార్జున ఆ అమ్మాయికి గిఫ్టు అందించారు. యాంకర్ సుజాత్ వరంగల్ జిల్లాకు చెందిన ఉప్పరపల్లి గ్రామానికి చెందిన యువతి. తెలంగాణ భాషలో గయ్యాలి హోస్ట్‌గా మంచి హోస్ట్‌గా ప్రేక్షకదారణను మూటగట్టుకొన్నారు.

  కనెక్షన్ గేమ్..

  కనెక్షన్ గేమ్..

  కనెక్షన్స్ గేమ్ అంటూ కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశ పెట్టాడు. ఇప్పటి వరకు వచ్చిన మెనాల్, సూర్య కిరణ్, లాస్య, అభిజీత్‌లు మిగతా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉండే క్వాలిటీస్, వాటిపై ఉండే నంబర్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.. ఈ కనెక్షన్స్ చాలా అవసరం అని నాగ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అభిజీత్ మూడో నంబర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో సర్దుకునే తత్త్వం తిండిబోతు ఓసీడీ అనే విషయాలు ఉండగా ఆ బాక్స్‌లో షూ వచ్చింది. సూర్య కిరణ్ ఐదో నంబర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో నమ్మకస్తుడు.. స్ట్రిక్ట్, గజిబిజీ.. అనే లక్షణాలు ఉన్న వారు కావాలని కోరుకున్నాడు. అతనికి తాళం ప్రాపర్టీగా ఆ బాక్సులో వచ్చింది. ఇక లాస్య ఆరో నంబర్‌ను సెలెక్ట్ చేసుకుంది. అందులో షాపింగ్ పిచ్చి, దూకుడు, ఫిట్.. అనే లక్షణాలున్నాయి. ఇక అందులో ప్రాపర్టిగా సుత్తి వచ్చింది.

  యువ నటుడు అభిజిత్

  యువ నటుడు అభిజిత్

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లోకి యువ నటుడు అభిజిత్ నాలుగో కంటెస్టెంట్‌గా భాగమయ్యారు. ఆదివారం సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన రియాలిటీ షోలోకి అభిజిత్ ప్రవేశించారు. హోస్ట్ నాగార్జున ఆహ్వానం మేరకు ఇంట్లోని వేదికపైకి వచ్చిన అభిజిత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంట్లో వినోదంతోపాటు నా టెలెంట్ ప్రదర్శిస్తానని అభిజిత్ అన్నారు.

  మూడో కంటెస్టెంట్‌గా లాస్య..

  మూడో కంటెస్టెంట్‌గా లాస్య..


  మూడో కంటెస్టెంట్‌గా యాంకర్ హోస్ట్ లాస్య ఎంట్రీ ఇచ్చింది. పదహారు రోజులు క్వారంటైన్‌లో ఉన్నాను. బాబును మిస్ అయ్యాను కానీ వాడు చాలా ఆనందంగా ఉండటంతో ఎనర్జీ వచ్చింది. ఇక స్టేజ్ మీదే నాగ్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ బొమ్మలో తన కొడుకు చూసుకుంటానని ఎమోషనల్ అయింది. చీమ ఏనుగు జోకులకు ఎంతో ఫేమస్ అయిన లాస్య.. నాగ్‌ను కూడా నవ్వించింది. ఉత్తరం, దక్షిణం అంటూ చీమ ఏనుగు జోక్ చెప్పింది. ఇక లోపలకి వెళ్లిన లాస్య.. మోనాల్, సూర్య కిరణ్‌తో పరిచయం పెంచుకుంది. ఇక బెడ్స్‌ను కూడా సెలెక్ట్ చేసుకుంది.

  రెండో కంటెస్టెంట్‌గా

  రెండో కంటెస్టెంట్‌గా


  సత్యం డైరెక్టర్ సూర్య కిరణ్ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. జీవితమనేది చదరంగం అని, మంచి చెడులు మనలోనే ఉంటాయని చెబుతూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటానని, వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని మసులుకుంటానని తెలిపాడు. ఇక హౌస్‌లోకి వెళ్లిన సూర్య కిరణ్.. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్‌తో ముచ్చటించారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

  రియాలిటీ షోలోకి హీరోయిన్ మోనాల్ గజ్జర్

  రియాలిటీ షోలోకి హీరోయిన్ మోనాల్ గజ్జర్

  ఆదివారం సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన రియాలిటీ షోలోకి హీరోయిన్ మోనాల్ గజ్జర్ అడుగుపెట్టింది. సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని బ్యాంగ్ బ్యాంగ్ పాటతో వేదిక మీదకు వచ్చారు. నాలుగో సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా మోనాల్ గజ్జర్ ఇంటిలోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకొన్నారు. మోనాల్ గుజ్జర్ తన కెరీర్‌ను సుడిగాడు సినిమాతో ప్రారంభించారు. ఆ తర్వాత ఓ కాలేజ్ స్టోరి, బ్రదర్ ఆఫ్ బోమ్మాలి, దేవదాసి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం గుజరాతీ, మరాఠీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

  ఓల్డ్ లుక్కులో నాగ్..

  ఓల్డ్ లుక్కులో నాగ్..

  ఫస్ట్ టైం హిస్టరీలో ఓ గెస్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నాడంటూ ఓల్డ్ లుక్కులో ఉన్న నాగ్ లోపలికి వెళ్లాడు. ఇక్కడ అందులో ప్రతీ రూంను చూస్తూ ప్రేక్షకులకు వాటి విశేషాలు చెప్పుకొచ్చాడు. గత సీజన్ల కంటే ఎంతో మెరుగ్గా, కోవిడ్ నిబంధనలకు తగ్గట్టుగా మార్పులు చేశారని చెప్పాడు. ఇందులో ఓ స్పెషల్ రూం కూడా ఉందని చెప్పాడు. ఇక స్టార్ మా కొత్త లోగోను కూడా లాంచ్ చేశారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా పసుపు కుంకుమ రంగులతో స్టార్ మా లోగో మారిపోయింది.

  నాగ్ గ్రాండ్ ఎంట్రీ..

  నాగ్ గ్రాండ్ ఎంట్రీ..

  మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, మూడో సీజన్‌ను నాగార్జున విజయవంతంగా నడిపించారు. ఇక ఈ నాల్గో సీజన్ పగ్గాలను కూడా కింగ్ నాగ్ చేతికే అప్పగించారు. నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ షోలో అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చాడు నాగ్. మాస్క్ ముఖానికి కానీ ఎంటర్టైన్మెంట్‌కు కాదంటూ మాస్ సాంగ్ స్టెప్పులు వేశాడు.

  ఆపై నువ్వువస్తావని సినిమాలోని కలలోనైనా కలగనలేదనే పాటకు స్టెప్పులు వేశాడు. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు కరోనా వైరస్‌లో అండగా ఉండాలని తెలిపేట్టుగా నేనున్నాను పాటకు కాళ్లు కదిపాడు. కానీ తన లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే.. సంతోషం సినిమాలోని దేవుడే దిగి వచ్చిన అనే పాటకు డ్యాన్స్ చేశాడు. బిగ్‌బాస్‌లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని కింగ్ సినిమాలోని నువ్వు రెడీ నేను రెడీ అనే పాటకు స్టేజ్‌ను రఫ్పాడించాడు. పేరుకు తగ్గట్టు కింగులా, మన్మథుడిలా నాగ్ అదరగొట్టేశాడు. అందమైన భామలతో చిందులు వేస్తూ దుమ్ములేపాడు.

  English summary
  Bigg Boss Telugu 4 Live Updates : Host Nagarjuna Grnad Entry, started Today at 6 PM on.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X