bigg boss telugu 4: పన్నెండో కంటెస్టెంట్‌గా కరాటే కళ్యాణి
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
పన్నెండో కంటెస్టెంట్‌గా కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చింది. జీవితంలో చదువు అబ్బలేదు గానీ సంప్రదాయ కళలపై మక్కువ ఏర్పడింది. హరికథలు చెప్పడంలో ఎన్నో అవార్డులు,రివార్డులు అందకుంది. బాబీ అంటూ చాలా ఫేమస్ అయ్యాను కానీ సినిమాల్లో చేసే క్యారెక్టర్ నేను కాదు. కరాటే కళ్యాణి అనే క్యారెక్టర్ పేరు కాదు.. నాకు తైక్వాండో ద్వారా వచ్చింది. జీవితంలో ఎందరో నన్ను వాడుకున్నారు. కానీ నాకు ఎవ్వరూ ఉపయోగపడలేదు అని కళ్యాణి తెలిపింది.

తల్లిని అయ్యే అదృష్టం లేదని ఎంతో బాధపడ్డాను. ప్రతీ సారి గర్భం దాల్చడం పోవడం జరుగుతూ వచ్చింది. ఇక నాకు తల్లిని అయ్యే అదృష్టం లేదేమో అని బాధపడ్డాను. కానీ ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నాను. వాడికి ఇప్పుడు పదేళ్లు. నా గుండెల మీద పెట్టుకుని పెంచాను అంటూ అందర్నీ ఎమోషనల్ చేసింది. ఇక స్టేజ్ మీదే బిగ్‌బాస్‌పై హరి కథను చెప్పి అందర్నీ ఆకట్టుకుంది. బిగ్‌బాస్ అంటే అద్దం లాంటిది.. మనల్ని మనకు చూపించేది అని తెలిపింది.


Click it and Unblock the Notifications











