bigg boss telugu 4: పదమూడో కంటెస్టెంట్‌గా నోయల్
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
పదమూడో కంటెస్టెంట్‌గా సింగర్, ర్యాపర్, నటుడు నోయల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటి నుంచో వద్దామని ఎదురుచూశాను. ఇంట్లో వాళ్లకు కూడా నేను ఎలా ఉంటానో తెలియదు. వారికి ఇప్పుడు తెలుస్తుంది. లవ్ బర్డ్స్ సినిమాలో సాంగ్ విన్నప్పుడు ర్యాప్ నేర్చుకోవాలనే కోరిక పుట్టింది అని నోయల్ తన గురించి చెప్పుకొచ్చాడు. అనంతరం నాగ్, బిగ్‌బాస్‌పై కూడా అద్భుతమైన ర్యాప్ పాడి అందర్నీ ఆకట్టుకున్నాడు.

హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నోయల్ అందరినీ పలకరించాడు. కనెక్షన్ గేమ్‌లో భాగంగా ఓ బాక్స్‌ను కూడా సెలెక్ చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్, ఏస్తర్ జంట తాజాగా విడాకులు తీసుకుని వేరు పడ్డారు. వీరి విడాకుల అంశం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక విడాకుల అనంతరం నోయల్ చేస్తోన్న సూక్తులు, కొటేషన్స్ ఫుల్ హల్చల్ చేశాయి. అయితే అవన్నీ బిగ్ బాస్ ఎంట్రీ కోసమే అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











