మిత్రులెవరు? శత్రువులు ఎవరు? బిగ్‌బాస్ ఇంటిలో హైడ్రామా.. సీక్రెట్ రూమ్‌లోకి అఖిల్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 66వ రోజు హైడ్రామా నడిచింది. ఇంటి సభ్యులను అర్ధరాత్రి నిద్రలేపి తమ వస్తువులను సూట్‌కేసులో నింపుకొని బయటకు వెళ్లమని ఆదేశించాడు. దాంతో ఇంటి సభ్యులు కొంత మేరకు ప్రాంక్ అనుకొని అనుమానపడ్డారు. కానీ ఆ తర్వాత ఇంటి సూట్‌కేసు తీసుకొని ఇంటి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు పంపే వ్యక్తి కోసం ఏకాభిప్రాయానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే.

ఇంటి సభ్యుల్లో గందరగోళం

ఇంటి సభ్యుల్లో గందరగోళం


బిగ్‌బాస్ ఇంటిలో బయటకు పంపే వ్యక్తి కోసం ఓటింగ్ జరిగింది. కొందరు అరియానా పేరు, మరికొందరు అఖిల్‌ పేరును సూచించారు. అభిజిత్ తానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, లాస్య తానే స్గ్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పింది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గందరగోళం నెలకొన్నది.

అఖిల్‌ను తప్పుపట్టిన సోహైల్

అఖిల్‌ను తప్పుపట్టిన సోహైల్


కెప్టెన్సీ టాస్క్‌లో విఫలమైనందుకు అఖిల్‌ను హరిక, సోహైల్ నిందించారు. మెహబూబ్, నీవు ఉన్నావని నేను కెప్టెన్సీని వదులుకొన్నాను. కానీ మీరు దానిని ఉపయోగించుకోలేదని సోహైల్ అన్నాడు. అంటే నీవు వదులుకొన్నది నా కోసం కాదు.. మెహబూబ్ కోసం అంటూ అఖిల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలా ఇంటి సభ్యుల మధ్య అలా వాగ్వాదం జరిగింది.

అఖిల్‌ను ఎలిమినేషన్‌ కోసం

అఖిల్‌ను ఎలిమినేషన్‌ కోసం


చివరకు ఇంటి సభ్యులందరిలో ఏడుగురు అఖిల్ పేరును ఖారారు చేశారు. అభిజిత్ తనకు తానే స్ట్రాంగ్ అని చెప్పుకోవడంతో ఇంటి సభ్యులు సరైన నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ ఒప్పించడంతో అభిజిత్ కూడా అఖిల్‌ పేరును ఒప్పుకొన్నాడు. దాంతో మెజారిటీ సభ్యులు అఖిల్‌ను బయటకు పంపించేందుకు నిర్ణయం తీసుకొన్నారు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బయటకు అంటూ

స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బయటకు అంటూ


ఇంటి సభ్యుల మెజారిటీ మేరకు అఖిల్‌ను మెయిన్ గేట్ గుండా ఇంటి బయటకు వెళ్లాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో అఖిల్ బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఆనందంగా ఉంది. ఓట్లు రాకుండా బయటకు వెళ్లే ఇంకా బాధగా ఉండేది అంటూ అఖిల్ చెప్పి బయటకు వెళ్లాడు.

భోరున ఏడ్చిన మోనాల్ గజ్జర్

భోరున ఏడ్చిన మోనాల్ గజ్జర్

అఖిల్‌ బయటకు వెళ్లిపోతుంటే మోనాల్ గజ్జర్ కన్నీరుమున్నీరయ్యారు. భోరున ఏడుస్తూ అఖిల్‌ను కౌగిలించుకొన్నది. సోహైల్ కూడా బాధపడుతుంటే అఖిల్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. దాంతో మోనాల్ పూర్తిగా బాధలో మునిగిపోయింది. ఇంటి సభ్యులు అఖిల్ వెళ్లిపోవడం గురించి రకరకాల విశ్లేషణలు చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
సీక్రెట్ రూమ్‌లొకి అఖిల్

సీక్రెట్ రూమ్‌లొకి అఖిల్


ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లిన అఖిల్ నేరుగా సీక్రెట్ రూమ్‌లోకి చేరారు. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లడంతో అఖిల్ షాక్ గురయ్యారు. ఇలాంటి చోటికి వస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇక అసలు గేమ్ ఏమిటో చూద్దాం అంటూ అఖిల్ సిద్ధమయ్యాడు. ఇంటిలో జరిగే విషయాలను టీవీలో చూస్తూ అఖిల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X