అందర్ని సంతోషపెట్టడానికి వచ్చానా? అభిజిత్, అఖిల్‌పై మోనాల్ ఫైర్.. నామినేషన్‌లో 9 మంది!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో రెండోవారం సరదాగా, సందడి సందడిగా మొదలైంది. ఇంటిలో రెండోవారం నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఎలిమినేషన్ కోసం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఇక ఇంటి సభ్యుల్లో అబిజిత్- మోనాల్, అఖిల్- మోనాల్ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు మొదలయ్యాయి. ఇక ఇంటి సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలతో రెండోవారంలో తొలిరోజు ముగిసింది. ఇంకా ఏడు, ఎనిమిదో రోజులకు సంబంధించిన ఎపిసోడ్ పూర్తి వివరాలు.. ఇవే
Recommended Video

అభిజిత్, మోనాల్ ఎమోషనల్‌గా
అభిజిత్, మోనాల్ గజ్జర్ మధ్య సంభాషణ ఆసక్తికంగా, ఎమోషనల్‌గా సాగింది. నాతో ఎందుకు మాట్లాడటం లేదు. నాతో కాసేపు మాట్లాడు అంటూ మోనాల్‌ను అభిజిత్ అడిగారు. ఏమని మాట్లాడాలి అంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడలేను. తర్వాత మాట్లాడుతానంటూ మోనాల్ లేచి వెళ్లబోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానుగా అభిజిత్ అంటే పట్టించుకోకుండా మోనాల్ వెళ్లిపోయింది.

కుమార్ సాయి ఎంట్రీతో
ఆ తర్వాత కుమార్ సాయి ఇంట్లోకి దొంగల అడుగుపెట్టారు. సోఫాపై రగ్గు కప్పుకొని పడుకొంటే అటువైపుగా దేవీ నాగవల్లి రాగా, ఆమెను చూసి దేవీ అంటూ చిన్న కూత పెట్టాడు. దాంతో దేవీ సోఫాఫై ఉన్నదెవరూ అంటూ దుప్పటిని తొలగించే ప్రయత్నం చేసింది. దాంతో ఇంటి సభ్యులందరినీ రమ్మను. నా ముఖంపై దుప్పటి లాగితే ఎలిమినేషన్‌లోకి వెళ్తావు అని బెదిరించాడు. ఆ తర్వాత అందరూ వచ్చి కుమార్ సాయిని చూసి అసలు విషయం తెలుసుకొన్నారు.

ఎనిమిదో రోజు ఉత్సాహంగా
ఇక ఎనిమిదో రోజు ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రంలోని కలర్‌ఫుల్ చిలక పాటతో మొదలైంది. ఆ పాటకు ఇంటి సభ్యులందరూ జోష్‌గా స్టెప్పులేశారు. గంగవ్వతోపాటు అందరూ డ్యాన్స్‌లు చేసి రోజును ఆరంభించారు. కొందరు కాలకృత్యాలు తీర్చుకొంటూ ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు.

అఖిల్‌తో మోనాల్ మధ్య భావోద్వేగం
అఖిల్ సార్థక్, మోనాల్ మధ్య మరోసారి ఎమోషనల్‌గా సంభాషణ జరిగింది. ఇంట్లో అందర్నీ సంతోషపెట్టాల్సిన పని నాది కాదు. నాకు ఒక అభిప్రాయం, ఫీలింగ్, కోపం ఉంటుంది. నాకు చాలా కోపం వస్తుందంటూ మోనాల్ ఊగిపోయింది. అఖిల్ సముదాయించేందుకు ప్రయత్నించాడు.

పడవలో నామినేషన్ ప్రక్రియ
ఇక నామినేషన్ టాస్క్‌ను బిగ్‌బాస్ మొదలుపెట్టారు. ఓ పడవను గార్డెన్‌లో పెట్టి అందులో అందర్నీ కూర్చొపెట్టారు. ఏడు తీరాలపాటు ఈ పడవ ప్రయాణం సాగుతుంది. ఎవరైనా దిగితే వారు నామినేట్ అవుతారు. తొలి అభ్యర్థిగా గంగవ్వ పడవను దిగిపోయింది. ఆ తర్వాత నోయల్ సీన్, మూడో వ్యక్తిగా మోనాల్, నాలుగో వ్యక్తిగా అఖిల్ సార్ధక్ దిగిపోయి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత కరాటే కల్యాణి, అమ్మా రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్ పడవ నుంచి దిగిపోయారు.

రెండోవారం నామినేషన్‌లో సెలబ్రిటీలు
అనంతరం బిగ్‌బాస్ మాట్లాడుతూ.. గంగవ్వ, నోయల్ సీన్, మోనాల్, అఖిల్ సార్ధక్, కరాటే కల్యాణి, అమ్మా రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్ నామినేట్ అయ్యారు. వారు వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వారు స్వయంగా నామినేట్ చేసుకొన్నారు అంటూ బిగ్‌బాస్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











