టిఫిన్ కోసం కకృత్తి.. అందరు ఎగబడడంతో హార్ట్ అయిన మోనాల్.. ప్రతి ఒక్కడు చెప్పేవాడే..
బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితులు ఎప్పు ఎలా మారతాయో ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక రూల్స్ పాటించకపోయినా టాస్క్ కి సరైన న్యాయం చేయకపోయినా కూడా కంటెస్టెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ ని పక్కన పెడితే పనిష్మెంట్స్ వల్ల కొన్నిసార్లు చుక్కలు కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం కమాండోలుగా ఉన్న కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ పవర్ సేవ్, ఫాస్ట్ ఫార్వార్డ్, స్లో మోషన్ అంటూ ఒక ఆటాడుకున్నాడు.

టిఫిన్ చేసే టైమ్ లో ఝలక్..
బిగ్ బాస్ హౌజ్ లో గత టాస్కులతో పోలిస్తే కమాండో ఇన్‌స్టిట్యూట్ టాస్క్ చాలా బాగా ఆకరిస్తోంది. ఇక టాస్కులో ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక గురువారం అయితే టిఫిన్ చేసే టైమ్ లో కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఝలక్ మాములుగా లేదు.

మోనాల్ పై సీరియస్ అయిన కంటెస్టెంట్స్
బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ టిఫిన్ చేసేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటూ తింటారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మోనాల్ చేసి ఆ పనికి అందరూ ఆమెపై కాస్త సీరియస్ అయ్యారు. దోశలు వేస్తున్న టైమ్ లో బిగ్ బాస్ వవర్ సేవ్ అనేశాడు. అయితే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా ఉండగా దోశ మాడిపోతుందని మోనాల్ కింద కూర్చుని అటు ఇటు తిప్పే ప్రయత్నం చేసింది.

అఖిల్ కూడా ఓ మాట అనడంతో..
మోనాల్ రూల్స్ పాటించకపోవడంతో అవినాష్ తో పాటు సోహెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే లాస్య కూడా ఒక మాట అనేసింది. మరో దోశ వేసుకోవచ్చని చెప్పినప్పటికీ మోనాల్ వినలేదు. ఇక లైన్ లోకి వచ్చిన అఖిల్ కూడా ముందే మీ పేరెంట్స్ రాలేదు. ఇలాంటి టైమ్ లో అవసరమా అంటూ చెప్పడంతో మోనాల్ ఒక్కసారిగా హార్ట్ అయ్యింది.
Recommended Video

ప్రతి ఒక్కడు అడ్వైజ్ లు ఇచ్చేవాడే..
అందరూ ఒకేసారి చెప్పడంతో మోనాల్ కూడా ఎవరు ఏమి చెప్పక్కర్లేదు అంటూ బుంగమూతి పెట్టేసుకుంది. నీ మంచి కోసమే చెబితే ఇలా చేస్తావు ఏమిటని కౌంటర్ ఇచ్చాడు సోహెల్. ఇక ఆ తరువాత ప్రతి ఒక్కడు అడ్వైజ్ లు ఇచ్చేవాడే అంటూ మోనాల్ గార్డెన్ లో కూర్చోగా అఖిల్, సోహెల్ వచ్చి మళ్ళీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ తరువాత మోనాల్ ఎప్పటిలానే కరిగిపోయింది.


Click it and Unblock the Notifications











