Bigg boss 4 telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ జరిగింది. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి ఎంట్రీ ఇవ్వగా.. జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకదారణ పొందిన ముక్కు అవినాష్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బావోద్వేగమైన పరిచయంతో జోకర్ పాత్ర ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. అవినాష్‌కు ఇంటి సభ్యులు ఘన స్వాగతం పలికి సంతోషంలో మునిగిపోయారు.

జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో ముక్కు అవినాష్ ఒకరు. ఈ స్టాండ్-అప్ కమెడియన్ కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవినాష్ మంచి క్రేజ్ అందుకున్నాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జన్మించిన అవినాష్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అవినాష్ తండ్రి ఇంతకుముందు ముంబైలోని అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రసిద్ధ బాలీవుడ్ స్టార్స్ వద్ద డ్రైవర్‌గా పనిచేశారు.

bigg boss telugu 4 mukku avinash Entered In Bigg Boss House

ఇక హైదరాబాద్ హొలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బి.టెక్ పూర్తి చేసిన అవినాష్ అక్కడ ఎడ్యుకేషన్ అయిపోగానే పలు లోకల్ టివి ఛానెల్స్ లలో మిమిక్రి ఆర్టిస్టుగా పని చేశాడు. ఇక 2014లో జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీమ్ లో సైడ్ కమెడియన్ గా ఈటీవీలోకి అడుగు పెట్టిన అవినాష్ ఆ తరువాత మరింత గుర్తింపును అందుకున్నాడు. ఆ తరువాత మాస్ అవినాష్ అనే పేరుతో జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మారాడు. ఇక ఇన్నాళ్లకు బిగ్ బాస్ షోతో లో అడుగుపెట్టి తన కెరీర్ గ్రోత్ ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాడు. మరి అవినాష్ ఈ పోటీలో ఎలా నిలదోక్కుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X