Bigg Boss Telugu 4: మై విలేజ్ షో 16వ కంటెస్టెంట్‌గా గంగవ్వ.. ముచ్చట్లతో ఇక కేక!
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు. ఈ షో నాలుగు సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సారి ఇంటి సభ్యుల ఎంపిక సెన్సేషనల్‌గా సాగింది. తొలిసారి బిగ్‌బాస్ షోలో 60 ఏళ్లకుపైబడిన గంగవ్వ అలియాస్ మిల్కూరి గంగవ్వ కనిపించడం విశేషంగా మారింది. గంగవ్వ 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాగార్జునతో మాట్లాడుతూ స్ఫూర్తిని నింపారు.
ఇక గంగవ్వ విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన అతి సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన మహిళ. నాట్లు, తోటల పెంపకం లాంటి వ్యవసాయ పనుల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న గంగవ్వ అనూహ్యంగా యూట్యూబ్‌లో షో ద్వారా అందరికీ పరిచయమైంది. తనదైన శైలిలో మాట్లాడుతూ.. అందర్ని ఆకట్టుకొంటున్నారు. ఈ మాటల గారడికి మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. అలా ఎన్నో లక్షల మంది అభిమానులను గంగవ్వ సంపాదించుకొన్నారు..

గంగవ్వ హోస్ట్‌గా వ్యవహరించే మై విలేజ షో ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూవర్ షిప్ ఉన్న కార్యక్రమం. ఇదిలా ఉంటే.. మల్లేషం సినిమాలో అతిథి పాత్రలో కూడా మెరిశారు. గంగవ్వ ఉండే వీడియోలకు మిలియన్ల వ్యూస్ రావడాన్ని బట్టి ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. ఇలాంటి క్రేజ్ ఉన్న గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. యూట్యూబ్‌లో మాదిరిగానే బిగ్‌బాస్‌లో కూడా సందడి చేస్తుందనే భావన ప్రేక్షకుల్లో ఉంది.


Click it and Unblock the Notifications











