bigg boss telugu 4 :ఓల్డ్ లుక్‌లో సందడి చేసిన నాగ్
ఎన్నో రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోన్న బిగ్‌బాస్ షో ఎట్టకేలకు ప్రారంభమైది. ఇక ప్రతీ ఇంట్లో సందడి నెలకొంటుంది. కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, ఆపాయ్యతలు, బంధాలు, అనుబంధాలు, రాగద్వేషాలు, ఆట పాటలతో తెలుగు ప్రజల ఇంట్లో సందడి చేయబోతోన్నారు. హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. లైవ్ అప్డేట్స్ మీకోసం..
ఫస్ట్ ఎంట్రీ కోసం నాగ్ అదిరిపోయే కాన్సెప్ట్ డిజైన్ చేశాడు. ప్రోమోలో చూపెట్టినట్టుగా ముసలి నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. ఇక ముసలి నాగ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ కాకుండా, కంటెస్టెంట్లు కాకుండా ఓ గెస్ట్ లోపలకి వెళ్తున్నాడని నాగ్ చెప్పుకొచ్చాడు. ఇక లోపలకి వెళ్లిన ఓల్డ్ గెటప్‌లో ఉన్న బిగ్‌బాస్ హౌస్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. గార్గెన్ ఏరియా, స్విమ్మింగ్ ఫూల్, బాత్రూం ఏరియా అన్నింటిని నిశితంగా పరిశీలించాడు. ఇక అద్దాల గురించి చెబుతూ నిజాలు చెప్పేవి అంటూ ఓ సెటైర్ వేశాడు.

మూడు సీజన్లలో లేనీ ఓ స్పెషల్ రూం ఉందని చెప్పుకొచ్చాడు. ఇక లివింగ్ ఏరియాలో కూర్చున్న ఓల్డ్ నాగ్ హోస్ట్‌తో ముచ్చట్లు పెట్టాడు. డైనింగ్ రూంలో ఉన్నకుర్చీలను పెట్టి పదహారు మందిరా పిచ్చెదవా అంటూ తిట్టేశాడు. కన్ఫెషన్ రూం. బెడ్రూం, రంగులు, ఏసీ అంతా బాగుందిరా కానీ అన్నీ ఒక్క చోటే ఎందుకు పెట్టారురా అని సెటైర్ వేశాడు. ఓ స్పెషల్ రూం కూడా ఉందని అన్నింటి గురించి పరిచయం చేశాడు. ఇక స్టార్ మా కొత్త లోగోను కూడా లాంచ్ చేశారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా పసుపు కుంకుమ రంగులతో స్టార్ మా లోగో మారిపోయింది.


Click it and Unblock the Notifications











