దుమ్ము రేపుతున్న బిగ్‌బాస్.. ఐదోవారంలో రికార్డు ఓటింగ్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ప్రేక్షకాదరణ భారీగా పెరుగుతున్నదనే విషయం ఓటింగ్ ద్వారా స్పష్టమవుతున్నది. సీజన్ 4 ఆరంభంలోనే దేశంలోనే ఏ బిగ్‌బాస్ షో సాధించిన ఓట్లు సాధించడం ఓ రికార్డుగా మొదలైంది. ఐదోవారానికి ఈ షో చేరుకొన్న తర్వాత ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరిగింది. నాగార్జున చెప్పిన ప్రకారం ఈ వారం పెరిగిన ఓటింగ్ ఎంతంటే

వారం రోజుల్లో నిస్తేజంగా..
అయితే బిగ్‌బాస్ షో విషయానికి వస్తే వారం రోజుల్లో వ్యూవర్ షిప్ విషయంలో తేడా కొడుతున్నప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నట్టు టీఆర్సీ రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. అందుకు కారణం సరైన టాస్కులు లేకపోవడం, టాస్కులు ఆసక్తికరం ఉండకపోవడమనే మాట వినిపిస్తున్నారు. అయితే వారాంతంలో మాత్రం భారీగా ఆదరణ కనిపిస్తున్నది. అదే విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో పంచుకొన్నారు.

5 కోట్లతో ప్రారంభమై.. 8 కోట్లకు వరకు
ఐదో వారాంతంలో ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ 5 కోట్ల ఓటింగ్‌తో ప్రారంభమైంది. ఇప్పుడు మన ఓటింగ్ భారీగా పెరిగిందని నాగ్ చెప్పగానే.. ఇంటి సభ్యులు ఆసక్తిగా ఎన్ని ఓట్లు వచ్చాయని అడిగారు. దాంతో నాగార్జున.. ఈ వారం 8 కోట్ల ఓట్లు వచ్చాయని వెల్లడించడంతో ఇంటి సభ్యులందరూ సంతోషంలో మునిగిపోయారు.

మీ ఆట తీరే వల్లే బిగ్‌బాస్‌కు క్రేజ్
బిగ్‌బాస్‌కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఇంటి సభ్యుల ఆటతీరు కారణం. మీరు బాగా ఆడాలి. ఇంకా బాగా ఆడితే బిగ్‌బాస్ షోకు మరింత ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు అంతా చూస్తున్నారు. ప్రేక్షకులను మెప్పిస్తే మీకు మరింత పాపులారిటీ పెరుగుతుందని ఇంటి సభ్యులకు నాగార్జున సూచించారు.
Recommended Video

సుజాత ఎలిమినేషన్‌పై భారీగా ఊహగానాలు
ఇక ఐదోవారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏడుగురు సభ్యులపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. ఇప్పటికే సోహైల్, అఖిల్ సేఫ్ అయ్యారు. ఇంటి నుంచి సుజాత బయటకు వెళ్తారనే ఊహాగానాలు జోరందుకొన్నాయి. ప్రేక్షకుల ఊహగానాలు బిగ్‌బాస్ నిజయం చేస్తారా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











