Body Shaming Harika Dettadi..నీ చెల్లెను అలానే అంటావా? సొహెల్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో 11వ వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో ప్రకంపనాలు సృష్టించింది. తోటి కంటెస్టెంట్ శరీరాకృతిని వెకిలింపుగా కామెంట్ చేయడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇంతకు హారిక, సోహోల్ మధ్య మాటల యుద్దానికి కారణం ఏమిటంటే...

నన్ను వేస్ట్ ఫెలో అంటావా?

నన్ను వేస్ట్ ఫెలో అంటావా?

10వ వారాంతపు ఎపిసోడ్‌లో సోహైల్‌ను ఉద్దేశించి ఆయనను ఎవడు దేఖడు.. వేస్ట్ ఫెలో అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ సమయంలో ఊరకుండిపోయిన సోహెల్.. ఆ తర్వాత తనను అంత మాట అంటుందా అంటూ కామెంట్ చేశాడు. అఖిల్‌తో ఈ అంశాన్ని చర్చిస్తూ ఆవేశంతో ఊగిపోయాడు. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకొని నామినేట్ చేస్తూ సోహెల్ ఆవేశంగా మాట్లాడారు.

నీయమ్మ అనేది ఊతపదం నీకు..

నీయమ్మ అనేది ఊతపదం నీకు..

తనపై ప్రదర్శిస్తున్న సోహెల్ ఆవేశానికి అడ్డుకట్ట వేస్తూ హారిక నీకు నీయమ్మ అనేది ఎలా ఊతపదం ఎట్లానో.. నాకు వేస్ట్ ఫెలో అనేది ఊతపదం అంటూ కామెంట్ చేసింది. ఈ అంశంపై సోహెల్, హారిక ఇద్దరు తీవ్రంగా మాటలు రువ్వుకొన్నారు. ఆ సందర్భంలో నీవు ఇంతలేవు.. సప్పుడు జేయకుండా కుసో అంటూ సోహెల్ కసురుకొన్నారు.

టీవీలో ఓ అమ్మాయిపై శరీరంపై వ్యాఖ్యలా?

టీవీలో ఓ అమ్మాయిపై శరీరంపై వ్యాఖ్యలా?

అయితే సొహెల్ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ విషయంలో హారిక దేత్తడికి సపోర్ట్ చేయాలనుకొంటున్నాను. జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న షోలో ఓ అమ్మాయిని శరీర ఆకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు (బాడీ షేమింగ్). ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన సిగ్గుపాడాల్సిన విషయం. ఆయనకు చెల్లెలు ఉంటే అలానే అంటాడా? అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

సోహెల్ ఓ చెత్త ఆటగాడు..

సోహెల్ ఓ చెత్త ఆటగాడు..

బిగ్‌బాస్ హౌస్‌లో సోహెల్ చెత్త ఆటగాడు. హారికతో అలా దారుణంగా మాట్లాడటం ఈ సీజన్‌లో అతడు చేసిన అతిపెద్ద తప్పు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఓ అమ్మాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరూ అంగీకరించరు. ఈ విషయంలో నాగార్జున జోక్యం చేసుకోవాలి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

సోహెల్, కరివేపాకు అఖిల్ బుర్రలేదు

సోహెల్, కరివేపాకు అఖిల్ బుర్రలేదు

బిగ్‌బాస్ అంటే టాస్కులు ఆడటం, గెలవడం కాదు. మెహబూబ్ ఎలిమినేషన్ ఓ ఉదాహరణగా తీసుకొండి. సోహెల్, కరివేపాకు అఖిల్‌‌వి మట్టి బుర్రలు. ఆ విషయాన్ని వాళ్లు గ్రహించడం లేదు. బిగ్‌బాస్ అనేది వారి క్యారెక్టర్లకు ఓ పరీక్ష లాంటింది. ఆ విషయంలో వాళ్లిద్దరూ దారుణంగా బోల్తా పడ్డారు. కనీసం కామన్ సెన్స్ తెచ్చుకొని గెలువడం తర్వాత ముచ్చట అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

సోహెల్‌ది చెత్త యాటిట్యూడ్

సోహెల్‌ది చెత్త యాటిట్యూడ్

11వ నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత హారికకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఆమె తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంటిలో ఎవరి నుంచి ఏదీ ఆశించిన యువతిగా.. హౌస్లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. ప్రతీ టాస్క్‌లోనూ 100 శాతం కష్టపడుతుంది. సోహెల్‌ది చెత్త యాటిట్యూడ్.. ఛీ అఖిల్, సోహెల్ చెత్త అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

Recommended Video

Gatham Team On Their Technical Team Brilliance | Interview Part 3
నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వాలి...

నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వాలి...

బిగ్‌బాస్ షోలో సోహెల్ ప్రవర్తనను చూసిన తర్వాత మేము హారిక, అభిజిత్‌కు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం. మహిళా కంటెస్టెంట్లతో ప్రతీసారి ఉద్దేశపూర్వకంగా గొడవ పడుతుంటాడు. ఈ వారం వీకెండ్‌లో సోహెల్ చెత్త ప్రవర్తనకు నాగార్జున గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలని కోరుకొంటున్నాం. సొహెల్ చెత్త యాటిట్యూడ్ చాలా ఇబ్బందికరంగా, జీర్ణించుకోలేకుండా ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X