Bigg Boss Telugu 4:. కనెక్షన్ గేమ్ అంటూ కొత్త కాన్సెప్ట్..
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
కనెక్షన్స్ గేమ్ అంటూ కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశ పెట్టాడు. ఇప్పటి వరకు వచ్చిన మెనాల్, సూర్య కిరణ్, లాస్య, అభిజీత్‌లు మిగతా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉండే క్వాలిటీస్, వాటిపై ఉండే నంబర్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.. ఈ కనెక్షన్స్ చాలా అవసరం అని నాగ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అభిజీత్ మూడో నంబర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో సర్దుకునే తత్త్వం తిండిబోతు ఓసీడీ అనే విషయాలు ఉండగా ఆ బాక్స్‌లో షూ వచ్చింది.

సూర్య కిరణ్ ఐదో నంబర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో నమ్మకస్తుడు.. స్ట్రిక్ట్, గజిబిజీ.. అనే లక్షణాలు ఉన్న వారు కావాలని కోరుకున్నాడు. అతనికి తాళం ప్రాపర్టీగా ఆ బాక్సులో వచ్చింది. ఇక లాస్య ఆరో నంబర్‌ను సెలెక్ట్ చేసుకుంది. అందులో షాపింగ్ పిచ్చి, దూకుడు, ఫిట్.. అనే లక్షణాలున్నాయి. ఇక అందులో ప్రాపర్టిగా సుత్తి వచ్చింది.


Click it and Unblock the Notifications











