మరో చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. హారికకు గెలిచే అర్హత లేదంటూ అభి యూ టర్న్.. ఇచ్చి పడేసిన అరియానా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఎట్టకేలకు తుది సమరం మొదలయ్యింది. సోమవారం అనగానే ప్రతి ఒక్కరికి ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి పెరుగుతుంది. కానీ షో ఫైనల్స్ కు చేరుకోవడంతో ఇప్పుడు అలాంటి ప్రయోగాలు ఏమి ఉండవు. సూపర్ 5 కంటెస్టెంట్స్ లలో ఎవరో ఒకరు వచ్చే వారం విజేతగా నిలవబోతున్నారు. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ పెట్టాల్సిన చిచ్చులు గట్టిగానే పెట్టేట్టున్నారు. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో ద్వారా ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ పై అంచనా డోస్ పెంచారు.

బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వనున్నాడా?

బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వనున్నాడా?

బిగ్ బాస్ మొదలైనప్పుడు రేటింగ్స్ అందుకోవడానికి చాలానే కష్టపడింది ఆ తరువాత మెల్లగా ఎలిమినేషన్స్ తో హైప్ క్రియేట్ చేసినప్పటకి కొన్ని నెగిటివ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కొందరు కంటెస్టెంట్స్ ను అన్యాయంగా హౌజ్ నుంచి పంపేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి. ఇక ఫైనల్ విన్నర్ విషయంలో ఇపుడు బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడానేది సస్పెన్స్ గా మారింది.

అర్హత లేని కంటెస్టెంట్స్ గురించి చెప్పాలి అనడంతో..

అర్హత లేని కంటెస్టెంట్స్ గురించి చెప్పాలి అనడంతో..

ఇక నేడు ప్రసారం కానున్న షోలో కంటెస్టెంట్స్ మధ్య గోడవలు గట్టిగానే అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ పెట్టిన చిచ్చుకు మిత్రువులు కూడా శత్రువులు అవుతారని అందరికి తెలిసిన విషయమే. గతంలో ఎప్పుడు లేని విధంగా అబిజిత్, హారిక మధ్య కూడా బిగ్ బాస్ నిప్పురవ్వ రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులు అందరూ కూడా విజేత అవ్వడానిక అర్హత లేని కంటెస్టెంట్స్ గురించి చెప్పి సరైన కారణం కూడా చెప్పాలని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.

గతంలో ఇదే తరహాలో..

గతంలో ఇదే తరహాలో..

చాలా సందర్భాల్లో ఎలిమినేషన్ లోనే కంటెస్టెంట్స్ మధ్య అర్హతకు సంబంధించిన గొడవలు చాలానే వచ్చాయి. అర్హత లేని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను తప్ప అంటూ గతంలో అవినాష్ గట్టిగానే అరిచాడు. కానీ అదే అతనికి పెద్ద మైనస్ అయ్యిందనే టాక్ వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కు అర్హత లేని వాళ్ళ గురించి చెప్పాలని కారణంతో క్లారిటీ ఇవ్వాలని అనడంతో ఎక్కువమంది అరియానాపైనే కామెంట్స్ చేశారు.

హారికకు విన్నర్ అయ్యే అర్హత లేదు..

హారికకు విన్నర్ అయ్యే అర్హత లేదు..

హారిక అభిజిత్ మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిజిత్ ను కాపాడబోయి ఒకసారి రిస్క్ లో కూడా పడింది హారిక. ఇక హౌజ్ లో అలాంటి రిలేషన్స్ కు తావు లేదని నాగార్జున ట్విస్ట్ ఇవ్వడంతో ఒకసారి ఏకంగా అభిని నామినేట్ చేసింది. ఇక ఇప్పుడు అభి ఆమెకు బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అయ్యే అర్హత లేదని మరో షాక్ ఇచ్చాడు. ఆ చర్చ ఎలా ఉంటుందో చూడాలి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
 ఇచ్చి పడేసిన అరియానా

ఇచ్చి పడేసిన అరియానా

ఇక అభిజిత్ తప్పితే హారిక, సోహెల్, అఖిల్ ముగ్గురు కూడా అరియానాను టార్గెట్ చేసి మరీ ఆమె కోపాన్ని ఎత్తి చూపినట్లు అర్ధమయ్యింది. అర్హత లేదని చెప్పడంతో అరియానా కూడా గట్టిగానే ఇచ్చి పడేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X