Bigg Boss Telugu 4: తొలి రోజే రచ్చ.. సుజాతతో కల్యాణి ఫైట్.. డేంజర్‌ జోన్‌లో గంగవ్వ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో మొదటి రోజు భావోద్వేగాలు కనిపించాయి. తొలి టాస్క్‌లో కొన్ని ప్రశ్నలు ఇచ్చి కంటెస్టెంట్ల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పమని బిగ్ బాస్ అడగడం, నామినేషన్ల ప్రక్రియ హైలెట్‌గా నిలిచింది. ఇంటి సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు, కొట్లాటలు ఏడుపులు, పెడబొబ్బలతో ముగిసిపోయింది. తొలిరోజు విషయాలు ఏమిటంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 1 Highlights, కరాటే కళ్యాణి Vs జోర్దార్ సుజాత || Oneindia Telugu
పాటతో మొదలై.. డ్యాన్సులతో

పాటతో మొదలై.. డ్యాన్సులతో

ఇంటి సభ్యులు రోజువారి కార్యక్రమం ఎప్పటిలానే పాటతో ప్రారంభమైంది. బిగ్‌బాస్ ఇంట్లో ప్లే చేసిన పాటకు సెలబ్రిటీలందరూ హుషారుగా డ్యాన్స్ చేశారు. కంటెస్టెంట్లతోపాటు గంగవ్వ కూడా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. పాటకు డ్యాన్స్ చేసిన తర్వాత ఇంట్లోకి కొన్ని చిట్టిలు పంపించి.. ఒకరి గురించి మరొకరు తెలుసుకొనే గేమ్‌ను మొదలుపెట్టారు. ఆ గేమ్ సందర్భంగా మోనాల్ గజ్జర్, సూర్య కిరణ్ తదితరులు తమ జీవితాల్లోని కొన్ని సంఘటనల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.

మోనల్ గజ్జర్ కంటతడి

మోనల్ గజ్జర్ కంటతడి

మోనాల్ గజ్జర్ తన తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తాము ఓ గ్రామంలో ఉండేవాళ్లం. అక్కడికి నన్ను తీసుకొని వెళ్లేవారు అంటూ తన కుటుంబం గురించి చెబుతూ కంటతడి పెట్టారు. దాంతో లాస్య, ఇతర ఇంటి సభ్యులు మోనాల్ గజ్జర్‌ను ఓదార్చారు. ఇంటి సభ్యులు ఏడ్వడం చూస్తూ గంగవ్వ కూడా ఏడుపు అందుకోవడంతో అందరూ సముదాయించారు.

గంగవ్వ కూడా ఏడుస్తూ...

గంగవ్వ కూడా ఏడుస్తూ...

ఇంట్లో సభ్యుల్లో కొందరు తమ లైఫ్‌లోని విషయాలను తెలియజేస్తూ కంటతడి పెట్టడాన్ని గంగవ్వ జీర్ణించుకోలేకపోయింది. తాను కూడా ఏడ్వడం మొదలపెట్టడంతో అందరూ ఆమెను సముదాయించారు. ఆ తర్వాత తలనొప్పిగా ఉందంటే.. అఖిల్ సార్థక్ మసాజ్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత గంగవ్వ రిలాక్స్ అయింది.

సీక్రెట్ రూమ్‌లో సోహైల్, అరియానా గ్లోరి

సీక్రెట్ రూమ్‌లో సోహైల్, అరియానా గ్లోరి

సీక్రెట్ రూమ్‌లో ఉన్న అరియానా, సోహైల్‌ ఇద్దరికి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులకు తమకు కావాల్సిన ఫుడ్‌ను ఏర్పాటు చేయమని అడిగితే.. వారికి కావాల్సిన ఆహారాన్ని అందించారు. అంతకుముందు సోహైల్ తన వీపుపై అరియానాను కూర్చోపెట్టుకొని పుషప్‌ చేస్తూ కనిపించారు. సీక్రెట్ రూమ్‌లో కాస్త చిలిపిగా గొడవలు పడుతూ కనిపించారు.

నామినేషన్ ప్రక్రియలో డ్రామా

నామినేషన్ ప్రక్రియలో డ్రామా

తొలి రోజునే నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇద్దరు చొప్పున రెండు కిటికీల ముందు నుంచుంటే.. ఎవరికైతే ఎక్కువ సార్లు ఇంటి సభ్యులు కిటికి మూస్తారో వారు నామినేట్ అవుతారు అని బిగ్‌బాస్ గేమ్ రూల్ చెప్పారు. నామినేషన్ ప్రక్రియలో అభిజిత్, సూర్య కిరణ్, అఖిల్ సార్థక్, దివి వద్యా, మెహబూబ్, జోర్దార్ సుజాత, గంగవ్వను నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియలో కరాటే కల్యాణి, జోర్దార్ సుజాత మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దానిని సూర్య కిరణ్ గొడవను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు.

కరాటే కల్యాణి వర్సెస్ జోర్దార్ సుజాత

కరాటే కల్యాణి వర్సెస్ జోర్దార్ సుజాత

ఇంటి పనుల విషయంలో మరోసారి సభ్యుల మధ్య గొడవ జరిగింది. వంట విషయంలో సుజాత్, కరాటే కల్యాణి మధ్య మళ్లీ గొడవ జరిగింది. చిన్న కారణాలతో నన్ను మనస్తాపానికి గురిచేశారు. ఇంట్లోకి చేరి కల్యాణి ఎడుపులతో గందరగోళం చేసింది. లాస్య వచ్చి సర్ది చెప్పడంతో కల్యాణి ఏడుపు ఆపేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X