బిగ్‌బాస్ తెలుగు 4 సెలబ్రిటీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్ సెంటర్‌లో కలకలం
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రసారానికి అంతా సిద్దమైంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, ఇంట్లోకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాట్లను దిగ్విజయంగా ముగించే ఏర్పాట్లలో నిర్వాహకులు ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో కరోనా పరిస్థితులు ఊహకు అందని విధంగా ఉన్నందున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కరోనా పరీక్షల విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు. అయితే షో ప్రారంభానికి ముందు నిర్వాహకులకు షాకిచ్చే విధంగా ఓ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ కంటెస్టెంట్‌కు కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ కంటెస్టెంట్ ఎవరంటే..

కరోనా భయాల మధ్య షో ప్రారంభానికి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 ఒడిదుడుకుల మధ్య ప్రారంభానికి సిద్దమైంది. మార్చి నెల నుంచి కరోనావైరస్ వ్యాప్తి విజృంభణ భారీగా ఉండటం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ షో ఆరంభంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. అయితే నిర్వాహకులు అత్యంత జాగ్రత్తల మధ్య షోను మొదలుపెట్టేందుకు సిద్దమయ్యారు.

10 రోజుల ముందే కంటెస్టెంట్ల క్వారంటైన్
బిగ్‌బాస్‌లో పాల్గొనే 16 మంది కంటెస్టెంట్లకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించి సెలక్షన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత షో ప్రారంభానికి 10 రోజుల ముందే వారిని క్వారంటైన్‌కు తరలించి కోవిడ్ 19 పరీక్షల నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిపై నజర్ పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. బిగ్‌బాస్ షో నిర్వాహణ కోసం తీసుకొంటున్న చర్యలపై అందరికీ సంతృప్తి కలిగింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో
బిగ్‌బాస్ నిర్వాహకుల తమ ప్లాన్‌లో భాగంగా 16 మంది కంటెస్టెంట్లను హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అయితే ఆ క్వారంటైన్ సెంటర్‌లో జరిపించిన పరీక్షల్లో ఓ యువ గాయకుడు, యాక్టర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై టీమ్ గుంభనంగా వ్యవహరిస్తున్నది.

నెగిటివ్ వస్తే ఇంట్లోకి.. లేకపోతే అవుట్
బిగ్‌బాస్ తుది జాబితాలోని ఆ గాయకుడి ఆరోగ్య పరిస్థితిని చివరి వరకు పరీక్షించడంపై నిర్వాహకులు దృష్టిపెట్టారు. ఒకవేళ షో స్టార్టయ్యే వరకు నెగిటివ్ రాకపోతే ఆ గాయకుడి ప్లేస్‌లో మరొరకరి తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. అభ్యర్థుల పేర్లను సీక్రెట్‌గా పెట్టే ఈ షో నిర్వాహకులు చివరి క్షణంలో ప్రకటించే అభ్యర్థులే తుది జాబితాగా మారుతారనే విషయం తెలిసిందే.
Recommended Video

ఆగస్టు 30న షో.. ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల జాబితా
ఆగస్టు 30న ప్రారంభం కాబోయే బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల పేర్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ షోలో యాంకర్ లాస్య, జబర్దస్త్ అవినాష్, గంగవ్వ, నోయెల్ సీన్, కరాటే కల్యాణి, అమ్మ రాజశేఖర్, రఘుమాస్టర్ దంపతులు, హంసానందిని, కామా జత్మలానీ, జబర్దస్త్ రాంప్రసాద్, సయ్యద్ సోహైల్ ర్యాన్, మెహబూబ్ షేక్ పేర్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











