‘బిగ్‌’బాస్ అప్‌డేట్.. ప్రోమో కోసం రంగంలోకి దర్శకుడు, దిగ్గజ కెమెరామెన్.. నాగ్ గెటప్ అదుర్స్!!

బిగ్‌బాస్ షో సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్లు లోపల ఫైట్స్ చేస్తూ ఉంటే వారి అభిమానులు బయట యుద్దం చేస్తుంటారు. తమ తమ ఫేవరేట్ కంటెస్టెంట్లను గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నిస్తుంటారు. బిగ్ బాస్ అంటే ఓ మజా. అలాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాల్గో సీజన్‌కు కూడా ముహూర్తం ఖరారైంది.

 ప్రోమో వైరల్..

ప్రోమో వైరల్..

లాక్ డౌన్ మొదలయ్యే కంటే ముందుగానే బిగ్ బాస్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిగో అదిగో ప్రారంభం కాబోతోంది అంటూ నానా రచ్చ చేశారు. ఇక లాక్ డౌన్ విధించడంతో కంటెస్టెంట్ల వేట జరుగుతోంది, త్వరలోనే ప్రారంభం కానుందని మళ్లీ వార్తలు వచ్చాయి. ఇక అవన్నీ రూమర్స్ అని అనుకుంటూ ఉండగానే.. నాల్గో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రోమో విడుదల చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు.

కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్..

కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్..

ప్రోమో అలా వచ్చిందో లేదో.. కంటెస్టెంట్ల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, తరుణ్, నందు, అఖిల్ సార్ధిక్, శ్రద్దా దాస్, మంగ్లీ, జబర్దస్త్ నరేష్ వంటి వారు పాల్గొనబోతోన్నారని చక్కర్లు కొడుతోంది. ఇందులో శ్రద్దాదాస్, తరుణ్ ఈ వార్తలను ఖండించారు.

లేటేస్టె అప్ డేట్..

లేటేస్టె అప్ డేట్..

ఇక ఈ షోకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయాయ్యట. ఆగస్టు రెండో వారంలో షో ప్రారంభించేందకు సర్వం సిద్దమైందట. ఈ క్రమంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఈ మేరకు అదిరిపోయే ఓ ప్రోమోను రెడీ చేస్తున్నారట.

రంగంలోకి దిగ్గజ కెమెరామెన్..

రంగంలోకి దిగ్గజ కెమెరామెన్..

ఈ ప్రోమో షూట్ కోసం అన్నపూర్ణలో వేసిన బిగ్ బాస్ సెట్‌ను వినియోగించుకుంటున్నారట. ఈ ప్రోమోను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్నినాయన ఫేమ్) తెరకెక్కిస్తుండగా.. రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ కేకే సెంథిల్ రంగంలోకి దిగాడట. వీరిద్దరి కలయికలో ప్రోమో అదిరిపోనుందట. ముఖ్యంగా నాగ్ గెటప్ సూపరో సూపర్ అని టాక్.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
అత్యంత కఠిన జాగ్రత్తలు..

అత్యంత కఠిన జాగ్రత్తలు..

ఈ సారి కోవిడ్ నిబంధనల కారణంగా బిగ్ బాస్‌ను అత్యంత కఠిన నిర్ణయాల మధ్య, మరింత జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తున్నారట. ఇందుకోసం కంటెస్టెంట్లను ముందుగానే కోవిడ్ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌లో ఉంచుతారట. ఇక హెస్ట్ నాగార్జున కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X