నువ్వొక్కడివే తోపువి కాదు.. అఖిల్‌తో సోహెల్ మాటల యుద్ధం.. భలే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్ తుది అంకానికి చేరుకొన్నది. టాప్‌ 5లో చేరేందుకు ఇంటి సభ్యులు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులకు నేరుగా టాప్‌ 5లో చేరి ఫైనల్‌లోకి చేరే అవకాశం లభించింది. ఈ టాస్క్‌లో భాగంగా సయ్యద్ సోహెల్ ర్యాన్, అఖిల్ సార్థక్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో అఖిల్, సోహెల్‌కు పెట్టిన ఫిట్టింగ్‌తో టాస్క్ మంచి రంజుగా మారింది. ఈ టాస్క్ వివరాల్లోకి వెళితే..

అఖిల్, సోహెల్ ఫ్రెండ్‌షిప్

అఖిల్, సోహెల్ ఫ్రెండ్‌షిప్


బిగ్‌బాస్ ఇంటిలో అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ ర్యాన్ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట మొదలైన తొలి రోజు నుంచి వారిద్దరి మధ్య అన్నాతమ్ముళ్ల బంధం కొనసాగుతున్నది. అలాగే విడదీయలేనంత స్నేహభావం కూడా ఉంది. పలు సందర్భాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు.

రోడ్ టూ ఫినాలే ఫైనల్ రౌండ్‌లో

రోడ్ టూ ఫినాలే ఫైనల్ రౌండ్‌లో

తాజాగా రోడ్ టూ ఫినాలే ఫైనల్ రౌండ్‌లో ఉయ్యాల టాస్క్‌ను బిగ్‌బాస్ తెరపైకి తెచ్చారు. ఉయ్యాల మీద అఖిల్, సోహెల్ కూర్చోవాలి. అలా ఎక్కువ సేపు ఎవరు కూర్చుంటారో వారు ఫైనల్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ బెర్త్ అవకాశాన్ని చేజిక్కించుకొనేందుకు తీవ్రంగా అఖిల్, సోహెల్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో అఖిల్, సోహెల్ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది.

100 శాతం ఎఫర్ట్ పెట్టలేదంటూ

100 శాతం ఎఫర్ట్ పెట్టలేదంటూ

రోడ్ టూ ఫినాలే ఫైనల్ రౌండ్‌లో భాగంగా గేమ్ ఆడుతూ.. కెప్టెన్సీ టాస్క్‌లో నేను ఫర్‌ఫెక్ట్‌గా ఆడాను. అందుకే నేను కెప్టెన్ అయ్యాను. కానీ నీవు 100 శాతం ఎఫర్ట్ పెట్టలేదు. కాబట్టి నీవు కెప్టెన్ కాలేదు అంటూ అఖిల్‌ను ఉద్దేశించి సోహెల్ వ్యాఖ్యలు చేశారు. దాంతో వారి మధ్య ఒక్కసారిగా చర్చ మొదలైంది

 కెప్టెన్సీ టాస్క్‌లో కూడా

కెప్టెన్సీ టాస్క్‌లో కూడా


సోహెల్‌తో అఖిల్ వాగ్వాదానికి దిగుతూ.. నేను ఏ టాస్కులోనైనా 100 శాతం ఎఫర్ట్ పెట్టాను. కెప్టెన్సీ టాస్క్‌లో కూడా నేను నా వంతు కృషి చేశాను అన్నాడు. అయితే టాస్కులతో అభిజిత్, అవినాష్ అందరూ 10 శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ నీ కెప్టెన్‌గా ఆడిన టాస్క్‌ గట్స్ ఉణ్న గేమ్ కాదు అంటూ సోహెల్ ఘాటుగా అన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
బిగ్‌బాస్ బాగా ఫిట్టింగ్ పెట్టారు

బిగ్‌బాస్ బాగా ఫిట్టింగ్ పెట్టారు

నేను స్విమ్మింగ్ ఫుల్‌లో ఆడిన గేమ్ మాత్రం గట్స్ గేమ్ అని నేను ఫీల్ అవుతున్నాను. నా దృష్టిలో అది గట్స్ ఉన్న గేమ్ అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో అఖిల్ ఏం చేయాలో చెప్పలేక.. బిగ్‌బాస్ బాగా ఫిట్టింగ్ పెట్టారు కదా అంటూ అఖిల్ అనడం తాజా ప్రోమోలో కనిపించింది. బుధవారం జరిగిన టాస్క్‌కు సంబంధించిన గేమ్ వివరాలు గురువారం రాత్రి ప్రసారం కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X