Bigg Boss Telugu 4 Road to Finale: మోనాల్ నన్ను కాలితో తన్నింది.. ముఖంపై తన్నినా.. అఖిల్‌పై అవినాష్ ఆగ్రహం

బిగ్‌బాస్ ఇంటిలో ఫినాలేకు తొందరతొందరగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఫినాలేకు మార్గం వేసిన బిగ్‌బాస్.. 86వ రోజున రోడ్ టూ ఫినాలే అనే గేమ్‌ను ఇంటి సభ్యుల ముందుకు తెచ్చాడు. ఇంటిలోని లాన్‌లో ఆవును బొమ్మను ప్రతిష్టించిన నిర్వాహకులు దాని నుంచి వచ్చే పాలు పట్టుకొని అత్యధికంగా సీసాల్లో నింపాలని, తక్కువగా వచ్చిన వారు లెవెల్ టూ నుంచి బయటకు వెళ్తారని సూచించాడు. ఈ గేమ్‌లో ఏం జరిగిందంటే..

రోడ్ టూ ఫినాలే లెవెల్ 1 స్టార్ట్

రోడ్ టూ ఫినాలే లెవెల్ 1 స్టార్ట్

రోడ్ టూ ఫినాలే లెవెల్ 1 గేమ్ కోసం బజర్ మోగించగానే ఇంటి సభ్యులు ఆవు పొద నుంచి వచ్చే పాలను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. తమ వద్ద క్యాన్స్‌లలో పాలు నింపుకొనేందుకు తంటాలు పడ్డారు. ఒకరినొకరు తోసుకొంటూ క్యాన్లలో పాలు నింపుకొనేందుకు గొడవ పడ్డారు.

పాలు పట్టుకోవడంలో గందరగోళం

పాలు పట్టుకోవడంలో గందరగోళం

తమ వద్ద క్యాన్లలో పాలు నింపుకొనే క్రమంలో అఖిల్, సోహెల్, అవినాష్‌కు మధ్య గొడవ జరిగింది. తమను పట్టుకోకుండా పాలు పట్టుకోవడంపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గేమ్‌ను గేమ్‌గా ఆడకపోతే నేను ఈ గేమ్ నుంచి బయటకు పోతాను. గేమ్ ఆడనంటూ అవినాష్ మొండికేశాడు. అయితే ఆడమంటూ సోహెల్ రిక్వెస్ట్ చేస్తే ఆడనంటూ బయటకు వెళ్లిపోయాడు.

మోనాల్ నన్ను కాలితో తన్నిందంటూ అవినాష్ ఫైర్

మోనాల్ నన్ను కాలితో తన్నిందంటూ అవినాష్ ఫైర్

రోడ్ టూ ఫినాలే లెవెల్ 1లో భాగంగా పాలు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. తనను మోనాల్ కాలితో తన్నిందంటూ అవినాష్ గట్టిగా అరిచాడు. తనను ముఖంపై కాలితో తన్నితే కూడా మాట్లాడకూడదా? మోనాల్‌ను అఖిల్ సమర్ధించడం సరికాదు. ఆడవాళ్లు చేస్తే రైట్.. మగవాళ్లు చేస్తే తప్పా అంటూ అవినాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆమె తన్నలేదంటూ అఖిల్ జోక్యం చేసుకోవడంపై అవినాష్ కోపగించుకొన్నాడు.

పాల క్యాన్‌లో నీళ్లను నింపుతూ

పాల క్యాన్‌లో నీళ్లను నింపుతూ

ఆవు బొమ్మ వద్ద పాలు పట్టుకోవడం మానేసి తన క్యాన్‌తో ఇంటిలోకి వెళ్లాడు. ఇంటిలో కిచెన్ వద్ద ఉన్న నల్లా నుంచి నీళ్లు తన పాలలో కలిపేశాడు. అలాగే ఫ్రిజ్‌లో పాలను తన క్యాన్‌లోకి పోసుకొని భారీగా సీసాలను పాలతో నింపేశాడు. దాంతో అనుమానం వచ్చిన కంటెస్టెంట్లు ఇలా నీళ్లు కలుపుకోవచ్చా అంటూ అడగడంతో అవినాష్ చేసిన పని రూల్స్‌కు వ్యతిరేకం. కాబట్టి ఈ గేమ్ నుంచి అవినాష్‌ను తప్పిస్తున్నామంటూ బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశాడు.

కలిసి ఆడటం గేమ్ కాదంటూ అభిజిత్

కలిసి ఆడటం గేమ్ కాదంటూ అభిజిత్

పాలను నింపే క్రమంలో సోహెల్, అఖిల్ ఇద్దరు కంబైన్ట్‌గా ఆడటంపై అభిజిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలా గేమ్‌ను కలిసి ఆడటం సరికాదు. మీరు చేసే ప్లాన్స్ నాకు అర్ధమవుతున్నాయి. మీ గేమ్ ప్లాన్ అర్ధం చేసుకోలేనంత పిచ్చి వాడిని కాదు అనేటట్టుగా అభిజిత్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా అఖిల్, అభిజిత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
లెవెల్ 1 నుంచి అరియానా, మోనాల్ అవుట్

లెవెల్ 1 నుంచి అరియానా, మోనాల్ అవుట్

ఇక రోడ్ టూ ఫినాలే గేమ్‌లో భాగంగా తక్కువగా సీసాలో పాలు నింపిన అరియానాను మోనాల్‌ను ఆట నుంచి తప్పించాడు. చివరకు గేమ్‌లో హారిక దేత్తడి, అఖిల్, అభిజిత్, సోహెల్ మిగలడంతో వారిని లెవెల్‌ 2కు ప్రమోట్ చేశాడు. ఇక లెవెల్ టూ గేమ్ బుధవారం ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X