twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను పంపించేయండి బిగ్‌బాస్.. బోల్డుగా ఉండలేను.. భోరున ఏడ్చిన అరియానా గ్లోరి

    |

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో పదోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య ఈ ప్రక్రియ ఎప్పటిలానే చిచ్చు పెట్టింది. అరియానా భావోద్వేగానికి లోనైంది. ఇంటిలో సోహైల్, మోనాల్‌తో అరియానాకు వాగ్వాదం చేటుచేసుకొన్నది. ఈ వారం ఇంటి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే...

    ఆవేదనతో సోహైల్ సయ్యద్

    ఆవేదనతో సోహైల్ సయ్యద్

    అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ తర్వాత సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఇంటిలో వినోదాన్ని ఎవరు పంచారు చెప్పురా అంటూ మెహబూబ్‌తో ఆవేదన చెందుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఏదైనా జరిగితే వెళ్లి సారీ చెబుతే వెంటనే సర్దుకొంటాడు. మాస్టర్ మంచి మనిషి అంటూ సోహైల్ కంటతడి పెట్టినంత పరిచేశాడు.

    అరియానా కూడా ఎమోషనల్‌గా

    అరియానా కూడా ఎమోషనల్‌గా

    ఇక అరియానా కూడా ఎమోషనల్ అయ్యింది. తన తీరును తప్పుపడితే నేను ఎలా ఉండాలో తెలియడం లేదు. నేను నాలా ఉండటం కష్టంగా ఉంది. బోల్డుగా ఉన్నానంటూ చెప్పారు. కానీ అలా ఉండలేకపోతున్నారు. ఆ బోల్డు అనే పదాన్ని మీరే ఉంచుకొండి అంటూ అరియానా బాధపడుతుంటే.. అవినాష్ ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే నా బాధను నేను దిగ మింగనివ్వండి అంటూ అరియానా రిక్వెస్ట్ చేసింది.

    నామినేషన్ల ప్రక్రియలో గొడవలు

    నామినేషన్ల ప్రక్రియలో గొడవలు

    నామినేషన్ల ప్రక్రియలో సోహైల్, అరియానా గట్టిగానే వాదులాడుకొన్నారు. నా తీరు అంతే .. అంటూ అరియానా సమాధానం చెప్పగా.. నేను ఇంతే అంటూ సోహైల్ జవాబిచ్చారు. ఇక అరియానా, హారిక మధ్య కూడా గొడవ జరిగింది. వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడకు అంటే.. నా మాట తీరే అంతా అని హరికకు అరియానా జవాబిచ్చింది. మోనాల్‌తో కూడా ఇలాంటి వాదనే జరిగింది.

    10వ వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు

    10వ వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు

    బిగ్‌బాస్ ఇంటి నుంచి 10వ వారంలో బయటకు వెళ్లేందుకు ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఎక్కువగా ఓట్లు వచ్చిన అరియానా, మోనాల్, అభిజిత్, సోహైల్, మెహబూబ్, హారిక నామినేట్ అయ్యారు. అఖిల్ తనను నామినేట్ చేయడంపై అభిజిత్ నామినేట్ అయ్యాడు. తాను సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా టాస్క్ నుంచి తప్పుకుంటే దానిని నీవు జడ్జ్ చేయడం ఇష్టం లేదు అంటూ ఘాటుగా స్పందించారు.

    లాస్య సీసాతో గట్టిగా కొట్టింది

    లాస్య సీసాతో గట్టిగా కొట్టింది

    నామినేషన్ టాస్క్‌లో తలపై సీసాతో గట్టిగా కొట్టింది అంటూ అవినాష్‌తో చెప్పి అరియానా బాధపడింది. అందరూ మెల్లగా కొట్టారు. కానీ లాస్య ఒక్కరే గట్టిగా కొట్టింది అంటూ తలను అవినాష్ చేతిలో పెట్టింది. ఇంత మంది వ్యతిరేకత మధ్య ఇంటిలో ఉండాలనేది లేదు. నాకు వెళ్లిపోవాలని ఉంది అంటూ అరియానా మరోసారి అవినాష్‌తో చెప్పుకొని బాధపడింది.

    English summary
    Bigg Boss Telugu 10th week show updates: Amma Rajashekhar has eliminated from Bigg Boss Telugu House in 9th week. Apart from that, Nominations for Elimination of 10 week has finished in the bigg Boss House. As per report, Abijeet, Lasya, Ariana Glory, Syed Sohel Ryan, Harika, Mehaboob in the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X