For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Elimination: లాస్య ఎలా, ఎందుకు అవుట్ అయ్యారంటే.. అభిజిత్‌ అలా ఇరికించి బయటకు

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 11వ వారాంతం ఫన్‌గా సాగింది. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో వినోదపరమైన ఆటపాటలను ఆడిస్తూ షోను మరింత ఆసక్తికరంగా మార్చారు. వారాంతం ఎలిమినేషన్ డే కావడంతో నామినేషన్‌లో ఉన్న సభ్యులందరినీ సేవ్ చేస్తూ గేమ్స్ ఆడించారు. చివర్లో అరియానా గ్లోరి, యాంకర్ లాస్య మిగిలిపోవడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ షో నుంచి యాంకర్ లాస్య ఎలిమినేట్ కావడం ఆశ్చర్యం అంతగా ఆశ్చర్యంతో కలిగించలేదు. అయితే ఆమె ఎలా అవుట్ అయ్యారంటే..

    Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
    హారికను అలా సేవ్ చేస్తూ

    హారికను అలా సేవ్ చేస్తూ

    ఆదివారం ఎపిసోడ్‌ను సినిమా పాటలతో ప్రారంభించారు. ఓ స్క్రీన్ మీద సినిమాకు సంబంధించిన పిక్చర్స్‌ను క్లూగా ఇచ్చి.. ఆ పాటను కనుక్కోవాలి. ఈ గేమ్ కోసం ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించారు. ఒక టీమ్‌కు హారిక, మరో టీమ్‌కు అరియానాను లీడర్‌గా ఎన్నుకొన్నారు. ఈ పాటల గేమ్‌లో హారిక టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్ తర్వాత ఒకరిని సేవ్ చేసేందుకు సిద్ధమైన హోస్ట్ నాగ్.. హారికను సేవ్ చేశాడు.

    మోనాల్, అభిజిత్ ఎలా సేవ్ అయ్యారంటే

    మోనాల్, అభిజిత్ ఎలా సేవ్ అయ్యారంటే

    ఇక ఎపిసోడ్‌లో రెండో గేమ్‌గా లూడో గేమ్‌ ఆడించారు. మళ్లీ అరియానా, హారిక జట్లు పోటీపడ్డాయి. ఈ గేమ్‌లో సోహైల్ నోటితో అవినాష్‌కు నెయిల్ పెయింట్ వేశాడు. అవినాష్ కామెడీ బాగా పండించాడు. ఈ గేమ్‌ మధ్యలో నామినేషన్లలో ఉన్న సభ్యుల నుంచి మోనాల్‌ను సేవ్ చేశాడు. ఆ తర్వాత అభిజిత్‌ను సేవ్ చేశారు. అలా గేమ్ కోనసాగిస్తూ ఫన్‌ను జనరేట్ చేశారు. లూడో గేమ్‌లో అరియానా టీమ్ విజయం సాధించింది.

    అరియానా, లాస్య‌కు టెన్షన్

    అరియానా, లాస్య‌కు టెన్షన్

    ఇక నామినేషన్లలో చివరకు అరియానా, యాంకర్ లాస్య మిగిలారు. వారిని ఓ అద్దం ముందు నిలబెట్టి వారిపై రెండు వారి ఫోటోలను డిస్‌ప్లే చేశారు. ఎవరి ఫోటో మీద లైట్ ఉండదో వారు ఎలిమినేట్ అవుతారు అని ఎలిమినేషన్ రూల్ చెప్పారు. అలా అరియానా, లాస్య ఎలిమినేషన్‌ అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ చివరకు అరియానా ఫోటోపై లైట్ పడటంతో లాస్య ఇంటి నుంచి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. దాంతో యాంకర్ లాస్య ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.

    జున్ను వద్దకు వెళ్లడం హ్యాపీగా ఉంది

    జున్ను వద్దకు వెళ్లడం హ్యాపీగా ఉంది

    ప్రస్తుత వారంలో లాస్యకు తక్కువ ఓట్ల రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. యాంకర్ లాస్య ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చారు. ఎలిమినేట్ కావడం నాకు బాధగా లేదు. జున్ను దగ్గరికి వెళ్లడం చాలా హ్యాపీగా ఉంది. మీరెవరూ బాధపడకూడదు అంటూ లాస్య చెప్పింది. ఇంటి సభ్యులతో సెల్ఫీ దిగి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడ నుంచి వేదికపైకి వెళ్లి నాగ్‌తో తన జర్ని చూసి ఎమోషనల్ అయ్యింది.

    టాప్‌ 2లో సోహెల్, అభిజిత్

    టాప్‌ 2లో సోహెల్, అభిజిత్

    బిగ్‌బాస్ వేదికపైన నాగ్‌తో కలిసి ఇంటి సభ్యులతో ముచ్చటించింది. టాప్ 2 కంటెస్టెంట్లు ఎవరుంటారని నాగ్‌ అడిగిన ప్రశ్నకు లాస్య సమాధానం ఇస్తూ.. సోహెల్, అభిజిత్ అంటూ తన ఛాయింట్ చెప్పారు. ఆ తర్వాత ఇంటి సభ్యులు గురించి వారి బలం, బలహీనతలను చెప్పారు. ఆ తర్వాత నాగ్ సూచన మేరకు క్వీన్ ఆఫ్ ది కిచెన్ లేదా కింగ్ ఆఫ్ ది కిచెన్‌ను ఎన్నుకోమని బిగ్‌బాంబ్ ప్రక్రియను ఇచ్చారు.

    అభిజిత్‌పై బిగ్‌బాంబ్ వేసిన లాస్య

    అభిజిత్‌పై బిగ్‌బాంబ్ వేసిన లాస్య

    అభిజిత్‌పై లాస్య బిగ్‌బాంబు విసురుతూ.. వారం పాటు కిచెన్‌లో వంట చేయాలని అన్నాడు. అభిజిత్‌కు వంట చేయడం బాగా వచ్చు. కాబట్టి ఇంటి సభ్యులకు వంట చేసి పెట్టాలని సూచించారు. రోజు రెండుసార్లు కిచెన్‌లో ఉండాలని సూచించారు. అందుకు అబిజిత్ సరే అనడంతో బిగ్‌బాంబు ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత నాగ్‌తో సెల్ఫీ దిగి బిగ్‌బాస్‌లో తన జర్నీని ముగించారు.

    English summary
    Bigg Boss Telugu 4's 11th week Elimination: Abijeet, Lasya, Ariana Glory, Syed Sohel Ryan, Harika, Monal Gajjar in the nominations list. On 74th day, Lasya husband, son entry into Bigg Boss Telugu 4. Monal Gajjar upset with Akhil Sarthak behaviour in Bigg Boss Telugu 4
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X