twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీయమ్మ పో అంటావా? నువ్వో వేస్ట్ గాడివి.. సోహైల్‌ను ఎటాక్ చేసిన హారిక దేత్తడి

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌ 11వ వారంలోకి ప్రవేశించింది. ప్రస్తుత వారానికి ఇంటి నుంచి బయటకు పోయే వ్యక్తి కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో వాడివేడిగా మాటల యుధ్ధం చోటుచేసుకొన్నది. ప్రధానంగా మాట్లాడే భాష, ఇంటి సభ్యుల తీరుపై ప్రధానంగా వాదన జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్ మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగిందంటే..

    ఫుల్ ప్రొటీన్ తీసుకొని మేక పులి అయింది

    ఫుల్ ప్రొటీన్ తీసుకొని మేక పులి అయింది

    మటన్ షాపు వాడు గడ్డిపెడితే లోపలికి వెళ్లిన మేక ప్రొటీన్స్ తీసుకొని పులిలా తిరిగి వచ్చింది అంటూ అఖిల్ అంటే.. పులి కాదు బలి మేకవు అంటూ సెటైర్ వేశాడు. దాంతో మోనాల్ విషయాన్ని ఆమె అనుమతి లేకుండా నామినేషన్ ప్రక్రియలోకి అఖిల్ లాగడంతో అభిజిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మోనాల్ లాగడంతో ఆమె అనుమతి తీసుకొని మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.

    నా గురించి మాట్లాడొద్దు వార్నింగ్

    నా గురించి మాట్లాడొద్దు వార్నింగ్

    నామినేషన్ల ప్రక్రియలో తన వ్యవహారం పాయింట్ కాదు. కాబట్టి మీకు ఏదైనా పాయింట్ ఉంటే దాని గురించి మాట్లాడండి. అంతేగానీ నా విషయంపై నామినేషన్ ప్రక్రియ జరగవద్దు అని అఖిల్‌కు, అభిజిత్‌ను హెచ్చరించింది. నాగార్జున చెప్పినప్పటికి నీవు అమ్మాయిని అడ్డుపెట్టుకొని గేమ్స్ ఆడుతున్నావు. నీ గేమ్స్ ఇక్కడ నడవవు.. బయటకు వెళ్లి ఆడుకోపో అంటూ అభిజిత్ కసురుకొన్నాడు.

    దేఖడు.. వేస్ట్‌గాడు అంటావా?

    దేఖడు.. వేస్ట్‌గాడు అంటావా?

    నాగార్జున ముందు నన్ను దేఖడు.. ఎవడు పట్టించుకోడు అంటూ మాట్లాడుతావా? అంటూ హరికపై సోహైల్ మండిపడ్డాడు. అయితే నీవు ఎంత పెద్దగా అరిస్తే.. దానికి మూడింతలు నా వాయిస్ రేజ్ అవుతుంది. నీయమ్మా అంటావా? నీకు ఊతపదం అయితే.. వేస్ట్‌గాడు అనేది నా ఊత పదం అంటూ సోహైల్‌కు హారిక ధీటుగా జవాబిచ్చింది. దాంతో సహనం కోల్పోయిన సోహైల్.. నీవు ఇంత ఎత్తులేవు అంటూ పొట్టిదానివి అనే విధంగా కామెంట్ చేయడంపై హారిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అభిజిత్‌పై అఖిల్, సోహైల్ సెటైర్లు

    అభిజిత్‌పై అఖిల్, సోహైల్ సెటైర్లు

    ఇక సోహైల్‌ను అభిజిత్ అతడు వాడే భాషను ఆధారంగా చేసుకొని నామినేట్ చేశాడు. నీయమ్మ అనడం సరికాదు. అది కాదురా బయ్ అనే మాట నాకు నచ్చదని చెప్పాను. కానీ నువ్వు అలానే వాడుతున్నావు. కాబట్టి నువ్వు ఆ మాటలు నావద్ద మాట్లాడకు అని అభిజిత్ హెచ్చరించాడు. దాంతో నాది బ్రో బ్యాచ్ కాదు.. నేను నా భాషను మాట్లాడుకోను. ఏమంటావు బ్రో అంటూ అఖిల్‌ను ఈ వాదనలోకి లాగి సెటైర్ వేశాడు. సోహైల్‌కు సపోర్టు చేస్తూ ఇంగ్లీష్‌లో వాట్సాప్ బ్రో అంటూ అభిజిత్‌ను టార్గెట్ చేశాడు.

    Recommended Video

    Mega Hero Kalyaan Dhev’s New Film Titled a As ‘Kinnerasani’
    అత్యధికంగా అభిజిత్‌కు నాలుగు ఓట్లు

    అత్యధికంగా అభిజిత్‌కు నాలుగు ఓట్లు

    ఇక నాలుగు ఓట్లతో అభిజిత్, మూడు ఓట్లతో మోనాల్‌కు మూడు ఓట్లు, లాస్యకు, అరియానా, హారిక, సోహైల్ రెండు ఓట్లు రావడంతో వారు 11వ వారానికి నామినేట్ అయ్యారు. కెప్టెన్ కావడంతో నామినేషన్ ప్రక్రియలో అఖిల్ సార్థక్ పాల్గొనలేదు. అవినాష్‌ను ఎవరూ నామినేట్ చేయకపోవడంతో ఈ వారం ఈ ప్రక్రియ నుంచి తప్పించుకొన్నారు.

    English summary
    Bigg Boss Telugu 11th week nominations: Mehaboob Dilse has eliminated from Bigg Boss Telugu House in 10th week. Apart from that, Nominations for Elimination of 11 week has finished in the bigg Boss House. As per report, Abijeet, Lasya, Ariana Glory, Syed Sohel Ryan, Harika, Monal Gajjar in the list. Before discussion, Hot discussion went between
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X