బిగ్‌బాస్‌ నుంచి అవుట్ అయ్యేది అతడేనా? ఇద్దరిపై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షో నాలుగో వారాంతానికి చేరుకొన్నది. ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్‌కు సిద్ధమవుతున్నారు. అయితే గతవారాల గేమ్ ప్రాతిపాదికగా ఇంటి సభ్యులు ఫెర్ఫార్మెన్స్‌పై ప్రేక్షకులు తీర్పు వెల్లడించబోతున్నారు. అయితే తాజా ఓటింగ్ ప్రకారం ఈ వారం ఇంటి నుంచి ఇద్దరు సభ్యులపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్టు ఓటింగ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సెలబ్రిటీ ఎవరంటే..

నాలుగో వారం నామినేషన్‌లో

నాలుగో వారం నామినేషన్‌లో

నాలుగో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో స్వాతి దీక్షిత్, అభిజిత్, యాంకర్ లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సోహైల్, హారిక దేత్తడి ఉన్నారు. అయితే వీరిలో అభిజిత్‌ ఓటింగ్ విషయంలో టాప్‌గా ఉన్నట్టు సమాచారం. మిగితా కంటెస్టెంట్స్‌లో లాస్య, స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ తప్పించుకొనేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.

మెహబూబ్‌ను వెంటాడుతున్న దురదృష్టం

మెహబూబ్‌ను వెంటాడుతున్న దురదృష్టం

ఇక ఇంటిలో మెహబూబ్‌ను దురదృష్టం వెంటాడుతున్నది. టాస్కుల్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసినా ప్రతికూల పరిస్థితులే ఎదురు అవుతున్నాయి. కిల్లర్ కాయిన్ టాస్క్‌లో స్విచ్ కార్డు లభించినా పాడేసుకోవడం కచ్చితంగా నెగిటివ్‌గా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఒకవేళ స్విచ్ కాయిన్‌ను సొంతం చేసుకొంటే మెహబూబ్ కెప్టెన్ అయి ఉండే వాడేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాజా ఓటింగ్‌ను పరిశీలిస్తే మెహబూబ్ తక్కువ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తున్నది.

 సయ్యద్ ప్రవర్తన తీరుపై అసంతృప్తి

సయ్యద్ ప్రవర్తన తీరుపై అసంతృప్తి

ఇక కిల్లర్ కాయిన్ టాస్క్‌లో గానీ, ప్రస్తుత వారంలో సోహైల్ దురుసుతనం అతడికి మైనస్‌గా మారే ముప్పు కనిపిస్తున్నది. అయితే ఇంటిలో వాడే భాష, సోహైల్ తీరు వివాదాస్పదమైంది. కిల్లర్ కాయిన్ టాస్క్‌లో అత్యుత్సాహం ప్రదర్శించారనే ఫీలింగ్ మెజారిటీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇతడు కూడా ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫమైనందున సోహైల్ ఎలిమినేషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.

 స్వాతి దీక్షిత్‌, హారికకు ముప్పు

స్వాతి దీక్షిత్‌, హారికకు ముప్పు

నాలుగోవారంలో నామినేట్ అయి తక్కువ ఓట్లు సాధించిన వారిలో హారిక దేత్తడి, స్వాతి దీక్షిత్ పేరు కూడా వినిపిస్తున్నది. అయితే టాస్కుల పరంగా దేత్తడి హారిక ఆకట్టుకొంటున్న కారణంగా ఓటింగ్ విషయంలో మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే మెహబూబ్ కంటే సోహైల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం స్పష్టమవుతున్నది.

Recommended Video

Check First Look Poster: Koratala Siva Releases Nithiin-Yeleti Film Title And Poster
 మెహబూబ్‌‌కు ఎలిమినేషన్ వేటు తప్పదా?

మెహబూబ్‌‌కు ఎలిమినేషన్ వేటు తప్పదా?

ఇక నాలుగోవారంలో ఇంటి నుంచి వెళ్లిపోయే కంటెస్టెంట్లలో మెహబూబ్, సోహైల్, స్వాతి దీక్షిత్ పేర్లు ఉన్నాయి. తాజా హాట్ స్టార్ యాప్ ఓటింగ్‌తో ఎక్కువ ప్రమాదం మెహబూబ్‌కే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అయితే ఇంకా మిస్డ్‌ కాల్ డేటా విషయాల ఆధారంగా కంటెస్టెంట్ బయటకు వెళ్లేది డిసైడ్ అవుతుంది. మెహబూబ్ గతవారమే ఎలిమినేట్ కావాల్సింది. కానీ దేవీ నాగవళ్లి అనూహ్యంగా ఎలిమినేట్ కావడం అనేక విమర్శలకు కారణమైంది. దేవీని మళ్లీ షోలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X