కెప్టెన్‌గా అమ్మా రాజశేఖర్ తడాఖా.. అభిజిత్‌ను హెచ్చరించిన బిగ్‌బాస్.. సోహైల్ మళ్లీ వీరంగం
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 9వ వారానికి కెప్టెన్ ఎంపిక పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం అమ్మా రాజశేఖర్ ఇంటి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టారు. దీంతో ఇంట్లో రచ్చ మొదలైంది. అమ్మా రాజశేఖర్ కెప్టెన్‌గా మారిన తర్వాత ఇంటి సభ్యుల మధ్య మరింత గొడవలు పెరిగిపోయాయి. ఈ గొడవలు ఎలా ఉన్నాయంటే..

ఇంటి పనుల అప్పగింతపై రచ్చ
కెప్టెన్‌గా ఎన్నికైన తర్వాత ఇంటి సభ్యులకు పనులను కేటాయించారు. అవినాష్, మెహబూబ్‌కు బాత్రూం, వాష్ ఏరియా పనులను అప్పగించాడు. అయితే సోహైల్ మాకు అప్పగించిన పనులు సరిగా లేవు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా నేను చెప్పిన పని చేయాలి.. లేదంటే మానేయండి అంటూ ఆదేశాలు జారీ చేశాడు.

కెప్టెన్‌పై తిరుగుబాటు జెండా
అయితే కెప్టెన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హారిక, అభిజిత్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆ తర్వాత కెప్టెన్సీ అయ్యాక పనులు కేటాయించే విషయంపై ఇంటిలో ఇంతవరకు ఇలాంటి గొడవ జరగలేదు అంటూ హారిక విస్మయాన్ని వ్యక్తం చేశారు.

ఎదుటివాడు చెప్పేది వినండి..
ఇంటి పనుల విషయంలో అభిజిత్‌కు అమ్మా రాజశేఖర్‌కు గట్టిగానే గొడవ జరిగింది. అయితే ఎదుటి వాడు చెప్పేది వినండి మాస్టర్ అని అభిజిత్ అంటే.. అందుకు ససేమిరా అని అమ్మా రాజశేఖర్ అన్నాడు. ఆ తర్వాత ఏదో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే... బిగ్‌బాస్ హెచ్చరించాడు. దాంతో ఓ రకమైన సైగతో అమ్మా రాజశేఖర్ సంతోషంలో మునిగిపోయాడు. అంతలో.. అభిజిత్ నువ్వు అయిపోయావు అంటూ హారిక పక్క నుంచి ఏదో అనడం కనిపించింది.

మోహబూబ్‌పై సోహైల్ మండిపాటు
ఇక ఇంటి పనుల విషయంలో సోహైల్‌కు, మెహబూబ్‌కు జగడం జరిగింది. బాత్రూం, అది క్లీన్ చేసి డ్యాన్సులు చేసుకొంటూ ఉంటే మేము చూడాలా? అంటూ సోహైల్ కామెంట్ చేశాడు. అయితే నీకు నాకు మధ్య ఫ్రెండ్‌షిప్ లేదు అంటూ మెహబూబ్ అనగానే చేతిలో ఉన్న వస్తువును సోహైల్ నేలకేసి కొట్టి మరోసారి వీరంగం సృష్టించాడు. ఇలా రకరకలా గొడవలతో బిగ్‌బాస్ షో ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











