అఖిల్ లక్కు బాగుండి ఎలిమినేట్ కాలేదు.. అభిజిత్ ఫైర్.. సమర్ధించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 4 షోలో 11వ వారంలో రచ్చ రేపిన మటన్ షాప్ పంచాయితీ శనివారం రోజున హోస్ట్ నాగార్జున ముందుకు వచ్చింది. ఈ వ్యవహారంపై అఖిల్, అభిజిత్ మధ్య భారీగా చర్చ జరిగింది. వారి వాగ్వాదాన్ని హోస్ట్ నాగార్జున ఓపికగా వింటూ కనిపించారు. వారాంతంలో షోలో ఇంకా ఏం జరిగిందంటే..

తప్పేముంది.. నేను ఇదే మాట చెబుతా
అఖిల్, అభిజిత్‌ను నిలబెట్టిన హోస్ట్ నాగార్జున.. ఏమిటీ మటన్ షాపు ముందు మేక అంటూ ప్రశ్నించాడు. దాంతో అభిజిత్‌ను చూపిస్తూ అఖిల్ మాట్లాడమన్నట్టు సైగ చేశారు. దాంతో తప్పేమి ఉంది.. నీ ముందు చెప్పమన్నా నేను ఇదే మాట చెబుతాను అని అభిజిత్ అన్నాడు.

బిగ్ బాస్ తలుచుకొంటే నీ పరిస్థితి
అభిజిత్ మాటలను అడ్డుకొంటూ అఖిల్ స్పందిస్తూ.. ఏం చెబుతావు అని ప్రశ్నించాడు. దాంతో తన ముందు ఏం మాట్లాడాలంటే ఇదే జరుగుతుంది. బిగ్‌బాస్ తలచుకొంటే అఖిల్ పరిస్థితి మరోలా ఉండేది. ఆయన లక్కు బాగుండి ఇంట్లోకి వచ్చాడు. లేకపోతే అటు నుంచి అటే వెళ్లిపోయేవాడు అంటూ అభిజిత్ ఘాటుగా స్పందించాడు.

అభిజిత్ చెప్పింది కరెక్ట్ అంటూ
అభిజిత్ మాటలను సమర్ధిస్తూ.. చాలా మంది సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన వాళ్లు అటు నుంచి అటే వెళ్లిపోయారు అని అన్నారు. అయితే అప్పుడు మాట్లాడిన మాట ఏంది? ఇప్పుడు మాట్లాడిన మాట ఎంది సార్ అంటూ అభిజిత్‌పై అఖిల్ ఫిర్యాదు చేస్తూ కనిపించారు. ఇలా ఇంట్లో వారి మధ్య గొడవ భారీగానే సాగింది.
అప్పుడు ఆ టోన్ వేరేగా ఉందంటూ..
అయితే అభిజిత్ తీరును నాగార్జునకు ఎత్తి చూపుతూ.. మీకు చెప్పేటప్పుడు బుద్దిగా పద్ధతిగా చెబుతున్నాడు. కానీ నేను సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు అఖిల్ చెప్పిన మాటలు అలా లేవు. ఆ టోన్ వేరేగా ఉంది అంటూ అభిజిత్‌పై అఖిల్ మండిపడ్డారు.


Click it and Unblock the Notifications











