Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సోహైల్‌కు నరకం చూపించిన అరియానా.. మోనాల్‌పై హారిక ఫైర్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్లో 51వ రోజు సందడిగా, వినోదంగా సాగింది. ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం ఇంటిలోని కొందరు సెలబ్రీటీలు చిన్న పిల్లలుగా, మరొకొందరు కేర్ టేకర్‌గా వ్యవహరించారు. అయితే చిన్నపిల్లలుగా మారిన ఇంటి సభ్యుల గోల విశేషంగా ఆకట్టుకొన్నది. పిల్లలు పిడుగులా మారి ఏం చేశారంటే..
లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం
లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం అవినాష్, అరియానా, అమ్మా రాజశేఖర్, మెహబూబ్, హారిక చిన్నపిల్లలుగా మారారు. వారికి నోయల్, సోయల్, అఖిల్, అభిజిత్ కేర్ టేకర్‌గా మారిపోయారు. ఈ టాస్క్‌కు సంచాలకులుగా యాంకర్ లాస్య వ్యవహరించారు. ఈ సందర్బంగా పిల్లలు చేష్టలు కేర్ టేకర్లను నానా కష్టాలకు గురిచేశాయి.
కేర్ టేకర్లుగా వీరే
అమ్మా రాజశేఖర్‌కు అభిజిత్ కేర్ టేకర్‌గా, మెహబూబ్‌కు అఖిల్, అరియానాకు సోహైల్, హారికకు మోనాల్ గజ్జర్, అవినాష్‌కు నోయల్ సీన్ కేర్ టేకర్‌గా వ్యవహరించారు. సోహైల్‌ను అరియానా చాలా రకాలుగా కష్టాలకు గురిచేసింది. అరియానా ఎంతగా చిలిపి పనులు చేసిన సోహైల్ సహనంతో భరించాడు.
మెహబూబ్‌ను ఎత్తుకొని అఖిల్ పాట్లు
అఖిల్‌ను మెహబూబ్ ఎత్తుకొని తిరగమంటూ నానా హంగామా చేశారు. పలు మార్లు మెహబూబ్‌ను ఎత్తుకొని తిరిగాడు. అభిజిత్‌కు అమ్మా రాజశేఖర్ కూడా ఏడిపించే ప్రయత్నం చేశారు. ఇక అవినాష్ మాత్రం తనదైన శైలిలో వినోదాన్ని పండించాడు. అవినాష్ చిలిపి చేష్టలు నవ్వు పుట్టించాయి. చాలా రోజులుగా గొడవలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కాస్త రిలీఫ్‌ను కలిగించింది.
హారిక, అరియానా గొడవ పడి
ఇక టాస్క్‌లో చిన్న పిల్లలుగా వ్యవహరించిన అరియానా, హారికలు పెన్సిల్ కోసం గొడవ పడ్డారు. హారిక నుంచి పెన్సిల్ గుంజుకోవడంతో మోనాల్‌పై హారిక కోపగించుకొంది. నీవల్లే నా పెన్సిల్ పొయిందని హారిక కామెంట్ చేసింది. దాంతో మోనాల్ ఏం జరిగిందంటూ సర్దిచెప్పింది.