Don't Miss!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
‘అమ్మ’ను కోల్పోయిన బిగ్‌బాస్.. ఇంటి కెప్టెన్ ఎవరంటే.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్టుతో..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 9వ వారాంతం ఈ సీజన్లో ఎన్నడూ లేనంత హ్యాపీగా సాగిపోయింది. దానికి తోడు ఎలిమినేషన్ కారణంగా ఓ పక్క కంటెస్టెంట్లలో గుబులు కనిపించింది. ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారనే ఆందోళన నామినేట్ అయిన వ్యక్తుల్లో స్పష్టంగా కనిపించింది. యాంకర్ సుమ ఎంట్రీ ఇంటి సభ్యుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇంకా ఇంటిలో ఫన్ డే రోజు ఏం జరిగిందంటే..
దీపావళీ కానుక గిఫ్టులు
దీపావళీ పండుగ సందర్భంగా ఇంటి సభ్యులకు గిఫ్టులు తీసుకొచ్చిన హోస్ట్ నాగార్జున.. వాటిని అందుకోవడానికి కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడించాడు. ఇంటి సభ్యులు మరో ఇంటి సభ్యుడిని ఎంపిక చేసుకొని అతడితో గేమ్ ఆడించాలి. ఈ గేమ్‌లో అభిజిత్, లాస్యకు నిరాశ ఎదురైంది. వారు ఎంచుకొన్న కంటెస్టెంట్లు నిర్ణీత సమయంలో గేమ్ పూర్తి చేయకపోవడంతో వారికి గిఫ్టులు లభించలేదు.
అమ్మా రాజశేఖర్, మోనాల్‌కు నిరాశ
ఇక అమ్మా రాజశేఖర్, మోనాల్‌కు ఎవరూ గిఫ్టులు పంపించకపోవడం వల్ల వారికి దీపావళీ కానుక లభించలేదు. దాంతో మీకు ఎవరూ గిఫ్టులు పంపించకపోవడం వల్ల బాడధపడనక్కర్లేదు. కానీ నేను మీకు ఉన్నాను. మీకు గిఫ్టులు నేను పంపిస్తున్నాను అంటూ నాగార్జున ఆ ఇద్దరికి గిఫ్టులు పంపించారు.
సుమ ఇంట్రీతో డబుల్ ఫన్
ఇక ఇలా ఫన్‌గా సాగిపోతున్న ఎపిసోడ్‌లోకి యాంకర్ సుమ అప్పీయరెన్స్ ఇవ్వడంతో ఫన్ రెండింతలు పెరిగిపోయింది. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అందర్ని ఆటపట్టించింది. మధ్య మధ్యలో నాగార్జున వేసే పంచులకు ధీటుగా సుమ కామెంట్లు చేసింది. అలా ఇంటిలో వినోదాన్ని పండించి షో నుంచి గెస్టుగా వచ్చి బయటకు వెళ్లిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పడంతో ఇంటి సభ్యులు షాక్‌లో మునిగిపోయారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకొన్నాడు.
డబుల్ ఎలిమినేషన్ ట్విస్టుతో
9వ వారంతంలో చివరి రోజున ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టి మోనాల్‌ను సేఫ్ చేయడంతో అవినాష్, అమ్మా రాజశేఖర్ మిగిలారు. వారిని బూత్‌లోకి పంపించి నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇంటి సభ్యులు బూత్ డోర్లు తీయగా.. ఇద్దరు కనిపించలేదు. దాంతో డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే అనుమానాన్ని నాగార్జున వ్యక్తం చేశారు.
స్టోర్ రూమ్‌లో అవినాష్
నాగార్జున నోట డబుల్ ఎలినేషన్ మాట రావడంతో అరియానా షాక్ తిన్నది. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు అంటూ ప్రాధేయపడింది. అలా ఇద్దరు మాయమైన తర్వాత స్టోర్ రూమ్‌లో అవినాష్ ఏడుస్తూ కనిపించారు. దాంతో అందరూ అవినాష్‌ను ఓదార్చారు.
వేదికపై నాగార్జునతో అమ్మా రాజశేఖర్
ఇక బిగ్‌బాస్ నుంచి ఊహించిన విధంగానే అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఇంటి సభ్యులకు నాగ్ చెప్పడంతో కొందరు బాధలో మునిగిపోయారు. ఇంటి వేదికపైకి చేరుకొన్న అమ్మా రాజశేఖర్ తన జర్నీ చూసి చిన్న గేమ్ ఆడి ఇంటి నుంచి నిష్క్రమించారు. పదో వారంలో అమ్మ లేని కొరత బిగ్‌బాస్‌లో కనిపించనున్నది. బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారి ఓ కెప్టెన్ ఇంటి నుంచి వెళ్లిపోవడం రికార్డుగా మిగిలింది.
Recommended Video
ఇంటి యాక్టింగ్ కెప్టెన్‌గా మెహబూబ్
ఇంటి కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఎలిమినేట్ కావడంతో ఇంటి బాధ్యతలను చేపట్టేది ఎవరనే ప్రశ్నను నాగ్ లేవనెత్తాడు. నీవు కెప్టెన్‌గా ఇంటిని వీడుతున్నందున ఆ బాధ్యతను ఎవరికి అప్పగిస్తావని అడిగితే.. మెహబూబ్‌కు ఆ బాధ్యత అమ్మా రాజశేఖర్ అప్పగించాడు. దాంతో మెహబూబ్ యాక్టింగ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అయితే ఇమ్యునిటీ ఉండదని సూచించారు